Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అవినీతి ఆరోపణలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు వాటాలు ఉన్నాయని బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గులాబీ దళపతి కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 15న టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
Advertisement
కాగా, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై తేల్చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యేలను కూడా మార్చే ప్రసక్తే లేదని మళ్లీ పాత వాళ్లకే టికెట్లు ఇస్తామని నేతలకు గులాబీ బాస్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొనుగోలు విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్, బిజెపి, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన కన్న కూతురిని కూడా పార్టీ మారాలని అడిగారంటూ మండిపడ్డారు.
Advertisement
కవితను కూడా బిజెపిలోకి రమ్మన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా, అంటూ నిప్పులు చెరిగారు. బిజెపి చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో నేతలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. ఇటీవల టిఆర్ఎస్ నేతలపై జరుగుతున్న ఈడి దాడులపై స్పందించిన కేసీఆర్ దాడులను ఉపేక్షించవద్దని నేతలకు సూచించారు. ఈడి దాడులు చేస్తే తిరగబడాలని చెప్పారు. ఎక్కడ కేంద్ర సంస్థలు దాడులు చేస్తే అక్కడ ధర్నాలు చేయండి అని తెలిపారు. ఇక సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలనే కాదు, ఢిల్లీని కూడా షేక్ చేస్తున్నాయి.
READ ALSO : కేసీఆర్ “చాణక్యం”..ఈటలకు డిప్యూటీ సీఎం ?