Advertisement
క్రీడారంగంతో పాటు, రాజకీయ రంగంలోనూ సెంటిమెంట్లను పాటించడం పరిపాటిగా మారింది. నామినేషన్ వేసే సమయంతో పాటు పదవి బాధ్యతలు తీసుకునేంతవరకు నేతలు ప్రతి విషయంలోనూ ముహూర్తాలను, కొన్ని నమ్మకాలను పాటిస్తుంటారు. క్రికెట్ లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడు వార్త హల్చల్ చేస్తోంది. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన అందరు బ్యాట్స్మెన్ పేర్లలో A అనే ఆంగ్ల అక్షరం కామన్ గా ఉండటంతో అది కాస్త వైరల్ అవుతుంది.
Advertisement
ద్విశతక వీరులైన రోహిత్ శర్మ, మార్టిన్ గుప్తిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, సచిన్ టెండూల్కర్ ఇలా ఈ లిస్టులో ఉన్న ఎనిమిది మంది క్రికెటర్ల పేర్లలో A లెటర్ కామన్ గా ఉంది. దీంతో ఈ లిస్టును నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. న్యూజిలాండ్ తో గత మంగళవారం ఉప్పల్ లో జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. 149 బాల్స్ లో 208 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అతడు సొంతం చేసుకున్నాడు.
Advertisement
ఈ మ్యాచ్ లో టీమిండియా 12 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ల లిస్టులో కామన్ గా ఉన్న విషయాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తద్వారా క్రికెట్ లోను సెంటిమెంట్స్ కావాలంటూ నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఓవెల్స్ లో ఒక క్యారెక్టర్ అయినా A చాలా పేర్లలో కామన్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని సెంటిమెంట్ గా మార్చేసి, క్రికెట్ లవర్స్ కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తీసుకురావడం కాస్త విచిత్రంగానే అనిపిస్తోంది.
READ ALSO : బాలయ్యకి నాగార్జున ఇవ్వబోతున్న షాక్ ఇది ఊహించి ఉండరు గా !