Advertisement
చాలామందికి పొద్దున నిద్ర లేవగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెంటనే ఒక కప్ టీ కడుపులో పడేస్తారు.. నిజం చెప్పాలంటే ఉదయం పర్యావసనమే టి.. మనం టీ కి అంత కనెక్ట్ అయిపోయాం. ఈ భూమ్మీద అమృతం అంటే టీ అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి.. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల టీలు దొరుకుతున్నాయి.. ముఖ్యంగా గ్రీన్ టీ, లెమన్ టీ, పసుపు టీ, మసాలా టీ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని రకాలు ఉన్నాయి. ఈ టీలు మనకు ఆరోగ్యపరంగా చాలా సహాయపడతాయి.
Advertisement
అదే హెర్బల్ టీ.. రోగనిరోగ శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ టీ ని మితంగా తాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే మంచిదే కానీ, అమితంగా తీసుకుంటే అది విషంగా మారుతుంది.అయితే టీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. గుండెల్లో మంట, నిద్రలేమి రకరకాల ఇబ్బందికర పరిస్తితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే టీ ని సమయానుగుణంగా తీసుకుంటే మనకు ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
ముఖ్యంగా టీ ని ఏ టైంలో తాగాలి ఏ టైం లో తాగకూడదు అనే విషయాలను తారకరత్నకు ట్రీట్మెంట్ ఇస్తున్న నారాయణ హృదయాల సీనియర్ క్లినికల్ డైటీషియన్ శృతి భరద్వాజ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఉదయం లేదా సాయంత్రం టీ తీసుకోవడం వల్ల వచ్చే ముప్పు లేదని, అల్పాహారం లో లేదా భోజనంతో పాటు టీ తీసుకోకుండా ఉండడం మంచిదని భరద్వాజ్ చెప్పారు. అయితే జెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైటీషియన్ ప్రియా మాత్రం అల్పాహారంతో పాటు టీ తీసుకుంటే ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్నారు.
also read:మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణ గారిని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?