Advertisement
ఎప్పుడైనా సరే పిల్లలకి పేర్లు పెట్టాలంటే, వారి యొక్క నక్షత్రాన్ని అడిగి పండితులు ఏ అక్షరంతో పెట్టమంటే ఆ అక్షరంతో చాలా మంది పేర్లను పెడుతూ ఉంటారు. నామకరణ వేడుక రోజు బిడ్డ తండ్రి, తల్లి కూర్చుని బియ్యం మీద పేరు వ్రాసి పెద్దలు పండితుల సమక్షంలో పేరుని పెడతారు. అలానే పేరును ఎంచుకునేటప్పుడు పేరు బాగుందా..? ట్రెండీగా ఉందా అనేది చూసుకుంటారు.
Advertisement
ఈ రోజుల్లో కొత్త పేర్లు డిఫరెంట్ గా ఉండే పేర్లను ఎంచుకుంటున్నారు. అలానే తల్లిదండ్రులు పేర్లు ఎంచుకునేటప్పుడు ఆ పేర్లకి అర్థం కూడా కచ్చితంగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా పూర్వికులు పేర్లు కలిసేటట్టు చాలా మంది చూసుకుని పూర్తి పేరులో పూర్వీకుల పేరు కలిసేటట్టు చూసుకుంటారు. అయితే ఎప్పుడైనా సరే ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి పేర్లు అస్సలు ఆడపిల్లలకి పెట్టకూడదు.
Advertisement
ఆడపిల్లకి పేర్లు పెట్టేటప్పుడు ద్రౌపతి అనే పేరు పెట్టకూడదు. ఆమె పంచ పాండవులకి భార్య అయిదుగురు భర్తలు ఉండడం వలన ఈ పేరు ఎవరు పెట్టడానికి ఇష్టపడరు. అలానే రావణుడు భార్య మండోదరి. అందుకని మండోదరి అనే పేరుని కూడా పెట్టరు. మందర అనే పేరును కూడా ఎవరు పెట్టరు. ఎందుకంటే మందర చెడు కోరుకునే మనిషి. అందుకని ఆ పేరును కూడా పెట్టరు. లేనిపోని మాటల్ని రాముడితో చెప్పి రాముడిని అడవికి వెళ్లేలా చేసింది కైకేయి. అందుకనే ఆడపిల్లకి పేరు పెట్టేటప్పుడు ఈ పేరు కూడా పెట్టరు. పెట్టకూడదు.
Also read: