Advertisement
కార్తీకమాసంలో చివరి రోజున పోలిస్వర్గం అని అంటారు. మహిళలందరూ కూడా ఆ రోజు తెల్లవారుజామున లేచి చెరువులో, నదుల్లో స్నానం చేస్తారు. పూజ చేసి దీపాలని నదుల్లో వదులుతారు. పోలి కథను కూడా చదువుకుంటారు. అసలు పోలి పాడ్యమి నాడు ఏం చేయాలి..? ఏం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది..? ఎన్ని వత్తులు వెలిగించుకోవాలి..? వంటి విషయాలని ఇప్పుడు చూద్దాం. చాలామంది కార్తీక మాసంలో నియమాలని పాటిస్తూ రోజు శివారాధన చేస్తారు. తెల్లవారుజామున నది స్నానం చేసి పరమేశ్వరుడిని ఆరాధిస్తారు.
Advertisement
భక్తితో దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో స్త్రీలు భక్తితో అనేక నోములు, వ్రతాలు కూడా చేస్తారు. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా పోలి పాడ్యమి చేస్తారు. కార్తీకమాస అమావాస్య తర్వాత రోజు పోలి పాడ్యమిని జరుపుతారు. డిసెంబర్ ఒకటితో కార్తీకమాసం ముగుస్తుంది. తర్వాత రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు. మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలి పాడ్యమిని పోలీ స్వర్గం అని కూడా అంటారు తెల్లవారుజామున లేచి చెరువుల్లో, నదుల్లో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తే చాలా మంచిది.
Advertisement
Also read:
చివరి రోజు శివాలయానికి వెళ్లి అభిషేకాలు, పూజలు జరుపుతారు. ఈరోజు 30 వత్తులతో దీపాలని వెలిగించాలి అరటిదొప్పల్లో దీపాలని పెట్టి నీటిలో వదలాలి. అలా చేస్తే మంచి జరుగుతుందట. మూడు సార్లు నీటిని తోసి నమస్కరించుకోవాలి. 30 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే కార్తీకమాసం మొత్తం దీపాన్ని పెట్టిన పుణ్యం కలుగుతుంది ఈరోజు దీపదానం చేస్తే కూడా మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!