Advertisement
తెలుగు సినీ చరిత్ర గురించి చెప్పుకోవాల్సిన ప్రతి సందర్భంలోనూ ఉటంకించాల్సిన కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి జాబితాలో మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఒకటి. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1990 మే 9న విడుదలైన సోషియో ఫాంటసీ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి సృష్టించిన చరిత్ర, తిరగ రాసిన రికార్డులు, నెలకొల్పిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి అశ్విని దత్ నిర్మాతగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. మే 9వ తేదీతో 33 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Resd also: మొండిగా ఉన్న మీ భార్యని ఇలా దారిలోకి తెచ్చుకోండి!
* ఈ సినిమాలో ఓ సన్నివేశంలో శ్రీదేవికి డూప్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ నటించింది.
* హైదరాబాద్ లోని ఓడియన్ 70 ఎంఎం థియేటర్ లో ఈ చిత్రం ఏకధాటిగా ఒక ఏడాది పాటు నాలుగు షోలతో రఫ్పాడించింది.
* 44 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ చిత్రం.. రూ. 12 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
* ఈ సినిమాలో అమ్రిష్ పురి శిష్యుల్లా బోడి గుండ్లతో నటించడానికి దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. వాళ్ల గుండ్లకే దాదాపు నాలుగు లక్షల వరకు ఖర్చు అయినట్లు సమాచారం.
* అప్పట్లో చిరంజీవి తనకు కలిసి వచ్చిన దర్శకులు కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావుతో సీక్వెన్స్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కొండవీటి దొంగ వంటి సూపర్ హిట్ వచ్చిన తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే రెగ్యులర్ మాస్ చిత్రాలు కాకుండా ఏదైనా కొత్త కథతో సినిమా చేద్దాం అనుకున్నారట. దీంతో అశ్వినీ దత్ ఈ ప్రాజెక్టును నిర్మించడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఓ వజ్రాల నిధి అన్వేషణతో కూడుకున్న ఓ కథని కూడా అనుకున్నారట. ఇందులో శ్రీదేవిని హీరోయిన్గా కూడా ఫిక్స్ చేసి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఎక్కడో తప్పు జరుగుతుందని వారికి అనిపించి.. ఆ షూటింగ్ ఆపేసి మళ్ళీ ఆలోచనలో పడ్డారు. దీంతో ఆ తర్వాత పలు సిట్టింగ్ ల అనంతరం “జగదేకవీరుడు అతిలోకసుందరి” ఆలోచన తట్టింది. చిరుకి అత్యంత సన్నిహితుడు అయిన యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రానికి కధ అందించారు.
Advertisement
* అయితే ఈ సినిమా కోసం ముందుగా అనుకున్న కధ ఏంటంటే.. దేవలోకం నుండి వచ్చిన ఓ దేవ కన్య భూలోకంలో ఉంగరం పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ భూలోకానికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోతుంది. అయితే ముందుగా హీరో, హీరోయిన్ కలుసుకునే సీన్ కాకుండా థీమ్ ను మార్చేశారట. గాయపడిన పాప చికిత్స కోసం లక్షలు ఖర్చు అవుతాయని తెలుసుకున్న హీరో.. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు చంద్రుడి పైకి ఒక మిషన్ ని పంపాలని అనుకుంటారు. అందుకోసం స్పేస్ షిప్ లో చంద్రుడి పైకి వెళ్లి వచ్చిన వారికి కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతారు. ఈ ప్రకటన చూసిన చిరు స్పేస్ షిప్ లో చంద్రుడి పైకి వెలతాడు. అక్కడ విహరించేందుకు వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ ఉంగరం పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం కాస్త చిరుకు దొరకడం, ఇది తెలుసుకున్న హీరోయిన్.. హీరోని వెతుక్కుంటూ భూమి మీదకు వస్తుంది. ఇది ముందు అనుకున్న కథ.
* ఈ సినిమా విడుదల సమయానికి తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు. అది కాస్త తుఫాన్ గా కూడా మారింది. దీంతో ఈ సినిమా విడుదల సమయానికి ప్రింట్లు అందలేదు. ఇక అశ్విని దత్ ఈ ప్రాజెక్టు మీద 9 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేశాడు. ఇక ఏదైతే అది అయ్యిందని ప్రింట్లు పంపే ప్రయత్నం చేశారు. అవి చేరతాయో లేదో, షోలు పడతాయో లేదో తెలియదు. అసలు మే నెలలో వర్షాలు ఏంటని అంతా జుట్టు పీక్కొని మెంబర్ టీం లో లేడు అంటే అతిశయోక్తి కాదు.
* అయినా సరే ధైర్యం చేసి మొండిగా సినిమాని విడుదల చేశారు. చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కానీ టాక్ బాగా వెళ్లడంతో తుఫాన్ ని సైతం లెక్కచేయకుండా జనాలు థియేటర్లకు తరలివచ్చారు. థియేటర్లో మోకాళ్ల వరకు నీళ్లు ఉన్న లెక్కచేయకుండా జనాలు కూర్చొని సినిమా చూశారు. మొదటిరోజు కంటే 30వ రోజు కలెక్షన్లు ఎక్కువ రావడం ఈ సినిమాకే జరిగింది.
Read also: ఆ మెసేజ్ ఏంటి ? ఎందుకు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ?