Advertisement
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు ప్రస్తుత యంగ్ జనరేషన్ యువకులు. అలా కమెడియన్ గా నటన జీవితాన్ని ప్రారంభించి సెలబ్రిటీగా మారిన కమెడియన్ ప్రియదర్శి కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించారని చాలామందికి తెలియదు. ప్రియదర్శి పూర్తి పేరు పులికొండ ప్రియదర్శి. ఈయనకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ తన క్రేజ్ ని అంతకంతకు పెంచుకుంటున్నాడు ప్రియదర్శి. ప్రియదర్శి తండ్రి పేరు పులికొండ సుబ్బారావు. ఆయన ప్రొఫెసర్ మరియు గొప్ప కవి, డాక్టరేట్ కూడా పొందారు. ప్రియదర్శి తల్లి పేరు జయలక్ష్మి. ఈయనకి చెల్లెలు కూడా ఉంది. ఆమె నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్.
Advertisement
Read also: ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!
Advertisement
ఐతే ప్రియదర్శికి చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. కానీ ప్రియదర్శి నటుడు అవ్వడం వాళ్ళ నాన్నకి ఇష్టం లేక వాళ్ల నాన్న పనిచేస్తున్న కాలేజీలోనే మాస్ కమ్యూనికేషన్ లో చేరి షార్ట్ ఫిలిం నిర్మాణంలో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత 9 వేల జీతానికి అసోసియేషన్ విజువల్ ఎఫెక్ట్ ఏ విధంగా అందిస్తారో నేర్చుకున్నాడు. ఈ విధంగా సినిమా సర్కిల్ లో పెరిగి తానే సొంత కథలు తయారు చేసుకుని వాటిని సినిమాలుగా చేయాలని భావించాడు. కానీ ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ తర్వాత నటన జీవితాన్ని ప్రారంభించాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ ని తెరకెక్కించిన ప్రియదర్శి వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తొలి సినిమా టెర్రర్ కాగా ఆ సినిమాలో ప్రియదర్శి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు.
ఆ తర్వాత తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమాలో అవకాశం రావడంతో కమెడియన్ గా అదరగొట్టారు. ఈ సినిమా తర్వాత బొమ్మల రామారం సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ప్రియదర్శి చాలా సినిమాలలోనే నటించారు. అందులో.. ఘాజి, విన్నర్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, స్పైడర్, ఉన్నది ఒకటే జిందగీ, మిడిల్ క్లాస్ అబ్బాయి, నోట, జాతి రత్నాలు వంటి చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించారు. మొదట విలన్ పాత్రలు చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో కమెడియన్ గానే సెట్ అయిపోయారు.