Advertisement
ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్ కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారులు హర్షవర్ధన్ (33), రెండో కుమారుడు అఖిల్. హర్షవర్ధన్ బీఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ బ్రిస్బేన్ విశ్వవిద్యాలయంలో హెల్త్ మేనేజ్మెంట్ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత క్వీన్స్ ల్యాండ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా చేరారు. 20 ఫిబ్రవరి 2020 లో ఖమ్మంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత తీసుకెళ్తానని భార్యకు చెప్పి అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అనుకోకుండా అతని జీవితం తలకిందులైంది.
Advertisement
READ ALSO : సూర్య కుమార్ యాదవ్ సంపాదన గురించి తెలిస్తే షాక్ అవుతారు..
అక్టోబర్ లో వ్యాయామం చేస్తుండగా దగ్గుతో పాటు ఆయాసం రావడంతో హర్షవర్ధన్ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్స్ లో గుండె బద్దలయ్యే నిజం బయటపడింది. తనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్టు తేలింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేయమన్నారు. వారికి ధైర్యం చెప్పిన హర్షవర్ధన్ ఆస్ట్రేలియాలోనే మంచి చికిత్స లభిస్తుందని, మీరేం కంగారు పడకండి అని వారికి నచ్చచెప్పాడు. బతకడానికి ప్రయత్నించాడు. మెరుగైన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో అద్భుతమైన, అధునాతన వైద్యం అందినప్పటికీ ప్రయోజనం లేదు. అందువల్ల తన శరీరాన్ని ఆవహించిన క్యాన్సర్ భూతం ఎలా కబలిస్తుందో అంచనా వేయగలిగారు. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాను అంచనా వేసుకున్నాడు.
Advertisement
READ ALSO : తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు
తనకు సోకిన క్యాన్సర్ నయమయ్యే పరిస్థితి లేదని, చనిపోవడం ఖాయమని తెలుసుకున్న హర్షవర్ధన్ కట్టుకున్న భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోమన్నారు. ఆఖరికి తాను చనిపోయాక ఆస్ట్రేలియా నుంచి తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో తరచూ బంధువులకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. స్నేహితులను ఇంటికి పిలిపించుకునే కబుర్లు చెప్పేవారు. ఈ క్రమంలో గత నెల 24న విష్ణువర్ధన్ మృతిచెందాడు. ముందుగా ఏర్పాటు చేసుకోవడంతో బుధవారం ఉదయం ఖమ్మంలోని హర్షవర్ధన్ ఇంటికి అతని మృతదేహం చేరుకుంది. అనంతరం అంత్యక్రియలు జరిగాయి.
READ ALSO : అదిరిపోయే ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పిన విరాట్ కోహ్లీ