Advertisement
ఋతుస్రావం, లేదా పీరియడ్ అనేది స్త్రీ యొక్క నెలవారీ చక్రంలో సాధారణంగా జరిగే విషయం. అయితే.. ఈ సమయంలో స్త్రీలు నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. దీనిని డిస్మెనోరియా అని కూడా పిలుస్తారు. నొప్పి చాలా తరచుగా వస్తూ ఉంటుంది. చాలా మందిలో వెన్నునొప్పి, వికారం, విరేచనాలు మరియు తలనొప్పి వంటి ఇతర లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు. కొంతమంది ఈ నొప్పిని భరించలేక టాబ్లెట్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఎక్కువమంది మెఫ్తాల్ అనే టాబ్లెట్ ను ఉపయోగిస్తూ ఉంటారు.
Advertisement
అయితే.. ఈ టాబ్లెట్ ను ఎక్కువగా ఉపయోగించడం వలన సమస్యలు వస్తాయని, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఐపీసీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఇండియన్ ఫార్మాకోపోయియా కమీషన్ (IPC) మెఫ్టాల్, సాధారణంగా ఉపయోగించే నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAID) గురించి డ్రగ్ సేఫ్టీ హెచ్చరికను జారీ చేసింది, ఇందులోని మెఫెనామిక్ యాసిడ్, ఇసినోఫిలియా మరియు సిస్టమిక్ సింప్టమ్స్ (DRESS) సిండ్రోమ్‌తో ఔషధ ప్రతిచర్యను ప్రేరేపిస్తుందని తీవ్రమైన అలర్జీ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
Advertisement
ఒకవేళ ఈ మందులు వాడినా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే.. ఐపీసీ వెబ్సైట్ లో నివేదించామని పేర్కొంది. దీనివలన ఏమైనా ఇతర సమస్యలను వస్తున్నాయేమో గమనించాలని పేర్కొంది. ఈ టాబ్లెట్ వలన ప్రభావం అందరి మీదా ఉండకపోవచ్చని, కానీ ఈ టాబ్లెట్ వాడే వారు ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది అని ఐపీసీ పేర్కొంది. ఈ టాబ్లెట్ వలన డ్రస్ సిండ్రోమ్ వస్తోంది. అంటే మందుల కారణంగా వచ్చే అలర్జీ. ఈ మందుకు రోగ నిరోధక వ్యవస్థ స్పందించడం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ లక్షణాలు వెంటనే కనిపించవు. కానీ, శరీరంలోని అవయవాలు, చర్మం చాలా ఎక్కువగా ప్రభావితం అవుతాయి. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంది. చర్మంపై దద్దుర్లు, ముఖం వాపు, జ్వరం, ఇసినోఫీలియా, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలు పని చేయకపోవడం ఈ వ్యాధి లక్షణాలు.
Read More:
చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు! వీళ్ళు ఎవరు ? ఎవరు ఎంత వయసంటే ?
క్రికెట్ లో డక్ అవుట్ అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు పెట్టారంటే ?
రేవంత్ రెడ్డిపై కెసిఆర్ సర్కార్ కి ఇంత కక్ష ఉందా? రేవంత్ రెడ్డి పై అన్ని కేసులు పెట్టారా?