Advertisement
మగవాడు మంచి భర్త అని విశ్లేషించడానికి ఎన్నో సందర్భాలు ఉపయోగపడుతుంటాయి. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అతను ఎలాంటి వాడన్నది పక్కన పెడితే ఆడవాళ్లు, ఎక్కువగా తమ స్వభావం కన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని సైకాలజిస్టులు చెప్తారు. మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడని ఎన్నో స్టడీలో తేలింది. కాబట్టి తమ ముప్పావు జీవితాన్ని పంచుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి.
Advertisement
#అండగా నిలబడేవాడు.
ఈ కాలంలో చాలామంది ఆడవాళ్లు ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయినా సరే కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా భర్త అండగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనివల్ల జీవితం సజావుగా ఉంటుందని అంటున్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆదరించి పరిష్కారం చూపే దిశగా గైడ్ చేసి ఒత్తిడిని తగ్గించేవాడిని, ఉద్యోగం నుంచి రాత్రుళ్ళు ఇంటికి చేరినా సరే తనకోసం చూడకుండా వంట సిద్ధం చేసే వ్యక్తిని, ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ గా ఉండే వాళ్లను కోరుకుంటున్నారు. ఇలా అన్నింటిలోనూ సహకారం అందించే వ్యక్తి దొరికితే జీవితం సంతోషంగా సాగిపోతుందని వాళ్ళ అభిప్రాయం.
#కలిసిమెలిసి ఉండేవాడు
Advertisement
గంభీరంగా ఉండే మగవాళ్లలో చాలామంది సాధారణంగా తమ ఎమోషన్స్ ని అంత ఈజీగా బయటపడనీయరు. తమ ఎమోషన్స్ గురించి అసలు ఎవరికీ చెప్పరు. కొందరేమో అన్ని విషయాల్లో ఓపెన్ గా ఉంటారు. ఇప్పటి తరం అమ్మాయిలు తమకు కాబోయే అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలియాలనుకుంటారు. ఒకవేళ ఏమైనా పాత రిలేషన్షిప్స్ ఉన్నా సరే వాటి గురించి కూడా చెప్పాలని కోరుకుంటారు.
#చెప్పేది వినేవాడు
చాలామంది అబ్బాయిలు, అమ్మాయి ఏం చెబుతున్నా వింటున్నట్టు నటిస్తుంటారు. నిజంగా మనసుపెట్టి వినేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఎదుటి వాళ్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వినకపోవడం సహజంగా చాలామంది చేసేది. అయితే అప్పుడప్పుడు ధ్యాస పెట్టకపోవటంలో అభ్యంతరం ఏం ఉండదు. కానీ ఎప్పుడూ చెప్పేది వినకపోవడం, నాకెందుకులే అని పట్టి పట్టనట్టుగా ఉంటే మాత్రం నొచ్చుకునే విషయమే.
#అర్థం చేసుకునేవాడు
పార్ట్నర్స్ అన్నాక చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ అవి ఎప్పటికప్పుడు సమస్య పోయేలా ఉండాలి. అసలు గొడవలే లేని భార్యాభర్తలు ఉంటారు అంటే నమ్మబుద్ధి కాదు. ఎవరికి వాళ్లు తామే కరెక్ట్ అంటూ గొడవ పడుతుంటారు. కానీ పరిస్థితిని అంచనా వేసుకొని హెల్ది ఆర్గ్యుమెంట్ తో గొడవ క్లోజ్ చేసే వాళ్లను ఎవరైనా ఇష్టపడతారు. గొడవలన్నీ కోపం, కక్ష పెట్టుకోకుండా ముగించాలన్నమాట.
ఇవి కూడా చదవండి: 30 దాటిన తరవాత పెళ్లి చేసుకుంటే వచ్చే 5 సమస్యలు ఇవేనట..! జాగ్రత్త సుమీ..!