Advertisement
సాధారణంగా మనం జుట్టు కడుక్కోకపోతే దురద,చుండ్రు వంటి సమస్యలు పెరిగిపోతాయి. జుట్టు సమస్యలు ఉన్నవారు వారం రోజులు తలస్నానం చేయకుంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా మన శరీరంలో ఉన్న మురికిని తొలగించుకోవడానికి రోజు తలస్నానం చేస్తూ ఉంటాం. కానీ తరచుగా తలస్నానం చేయడం కొంతమందికి కుదరదు. కొంతమంది వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేస్తారు. కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేస్తూ ఉంటారు. తల స్నానం అనేది జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చాలామందికి తెలుసు.
Advertisement
Advertisement
మీరు కొన్ని రోజులు జుట్టును కడగకపోతే తల, చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల తల వెంట్రుకల నుంచి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా నూనెకు బదులుగా జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తే అవి మీ జుట్టు మీద ఉంటాయి. దీనివల్ల మీ వెంట్రుకలు కూడా పొడిబారిపోతాయట. ముఖ్యంగా తల, దురద చుండ్రు సమస్య పెరిగిపోతుందట. అంతేకాకుండా తలలో పేను, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి వారంలో వీలైనన్నిసార్లు జుట్టును శుభ్రం చేసుకోవడం మంచిదని వారు అంటున్నారు.
also read:మోహన్ బాబు మొదటి భార్య ఎవరో తెలుసా