• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Andhrapradesh » Chandrababu Marriage Photos: భువనేశ్వరి గారితో బాబు పెళ్లి నిశ్చయించిన తరువాత .. చంద్రబాబు ఎన్టీఆర్ తో కోరిన కోరిక ఏంటంటే ?

Chandrababu Marriage Photos: భువనేశ్వరి గారితో బాబు పెళ్లి నిశ్చయించిన తరువాత .. చంద్రబాబు ఎన్టీఆర్ తో కోరిన కోరిక ఏంటంటే ?

Published on December 16, 2023 by srilakshmi Bharathi

Advertisement

చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు 1981 సెప్టెంబర్ 10న గురువారం ఉదయం 8.06 గంటలకు వివాహం చేసుకున్నారు. వీరి వివాహాం మద్రాస్‌లోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పెళ్లి సమయానికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన సినిమాటోగ్రఫీ శాఖామంత్రిగా పని చేస్తున్నారు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు నాయుడు తన పెళ్లి నాటి విశేషాలను పంచుకున్నారు. భువనేశ్వరిని పెళ్లి చేసుకోవాలంటూ ఎన్టీఆర్ కోరారని.. అయితే ఒప్పుకోవడానికి మొదట్లో కొంత బెట్టు చేసానని సరదాగా చెప్పారు.

Advertisement

Chandrababu Wedding Photos

Chandrababu Wedding Photos

పెళ్లి చూపుల కోసం వెళ్ళినప్పుడే ఓ పెద్ద గజమాలను వేశారని.. కానీ అది మొయ్యలేక ఇబ్బంది పడ్డానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పెళ్లి చూపుల సమయంలోనే భువనేశ్వరితో మాట్లాడానని.. నేను పల్లెటూరిలో పుట్టి పెరిగానని, ఒకవేళ మంత్రి పదవి పోతే.. తిరిగి పల్లెటూరికి వెళ్లాలని భువనేశ్వరికి చెప్పానన్నారు. అందుకు భువనేశ్వరి.. భర్త ఎక్కడ ఉంటె భార్య కూడా అక్కడే ఉండాలని.. తన తండ్రి నేర్పారని తెలిపారు. ఆ మాటతో.. ఎన్టీఆర్ ఇంటికి అల్లుడిగా వెళ్లాలంటే అదృష్టం ఉండాలని అర్థమైందన్నారు.

Advertisement

పెళ్లి కుదిరిన తరువాత ఎన్టీఆర్ ని ఓ కోరిక కోరానని అన్నారు. కట్న కానుకలు ఏమీ వద్దు కానీ, పెళ్లి మాత్రం ఘనంగా జరిగితే చాలని అన్నానన్నారు. చిత్తూరు జిల్లాలోనే ప్రతి ఇంటికి శుభలేఖ పంపామని.. ఊహించని దాని కంటే ఎక్కువ మందే పెళ్ళికి వచ్చారని, ఏపీ మరియు తమిళనాడుకు చెందిన సినీ ప్రముఖులు హాజరు అయ్యారని అన్నారు. మనిషిని పూర్తిగా చదవాలంటే ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని అన్నారు. అభిమానులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని.. వారితో ఏకాంతంగా మాట్లాడాలంటే.. నన్ను కూడా బయటకు పంపేసేవారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టాలని ఎన్టీఆర్ కి సూచన చేసానని.. కానీ పార్టీ స్టార్టింగ్ లోనే నన్ను పార్టీలోకి తీసుకోవడానికి ఒప్పుకోలేదన్నారు.ఎన్టీఆర్ గెలిచాక.. రాజకీయాలు మానేసి వ్యాపారం వైపు వెళ్లాలని అనుకున్నానని.. కానీ ఆగష్టు సంక్షోభం వచ్చాకా.. రాజకీయాల్లోకి రాక తప్పలేదన్నారు.

Read More:

అసలు ఏమి మాట్లాడుతున్నావు రా నాయన? సలార్ గురించి ఈ కన్నడ స్టార్ ఇంత దిగజారి మాట్లాడాలా??

పవన్ తన భార్య నందిని మొదటి సారి ఎక్కడ కలిసారంటే ?

Related posts:

తిరుమల ఆలయం ముందు టిడిపి జెండా.. వైరల్ అవుతున్న ఫోటోలు! TDPచంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్..! cbn-release-dateచంద్రబాబు అక్టోబర్ 1 నే విడుదల అవ్వబోతున్నారా? ఆ రోజే ఎందుకంటే ? jrntrJr Ntr Silence on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఎన్టీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd