Advertisement
మనం కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. అయితే పెద్దవాళ్లు ఉన్నారన్న కారణంతో రైల్లో ఏసీ బోగీలో టికెట్ బుక్ చేసుకుంటాం. తీరా రైలు ఎక్కిన తర్వాత ఒకటే ఉక్క పోత. ఆరా తీస్తే ఏసీ పనిచేయలేదని తేలుతుంది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే, కేవలం నిట్టూర్చి ఊరుకోవాల్సిన పనిలేదు. మీకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ నుంచి రిఫండ్ కోరొచ్చు. ఇందుకోసం TDR( టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ను) ఫైల్ చేయాల్సి ఉంటుంది.
Advertisement
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?
TDR ఫైలు చేయాలంటే TTE నుంచి మీరు సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. IRCTC వెబ్సైట్ లేదా యాప్ లో మీరు TDR ను ఫైల్ చేయొచ్చు. ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది. అనంతరం సంబంధిత మొత్తాన్ని మీ ఖాతాలో IRCTC జమ చేస్తుంది. కేవలం ఏసి ఫెయిల్ అయినప్పుడే కాదు, రైల్వే శాఖ వల్ల మీకు అసౌకర్యం కలిగినప్పుడు వివిధ సందర్భాల్లో రిఫండ్ కోసం TDR ను ఫైల్ చేయొచ్చు.
Advertisement
#1 మీరు ప్రయాణించాల్సిన రైళ్లు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంటాయి. ఒకవేళ మీరు ప్రయాణించాల్సిన రైలు కూడా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లు గుర్తిస్తే అందులో మీరు ప్రయాణించకపోతే మీరు రిఫండ్ కోసం దరఖాస్తు చేయొచ్చు. పూర్తి రీఫండ్ కావాలంటే రైలు బయలుదేరే వాస్తవ సమయానికంటే ముందే TDR ఫైల్ చేయాలి. ఒకవేళ మీరు వెళ్లాలనుకున్న రైలు పూర్తిగా క్యాన్సిల్ అయితే TDR ఫైల్ చేయకుండానే రిఫండ్ పొందొచ్చు.
#2 ఏదైనా కారణంతో మీరు ప్రయాణించాల్సిన రైలు రూటు మళ్లించడం వల్ల మీరు రైలు అందుకోకపోయినా రిఫండ్ పొందొచ్చు. రైలు రూటు మళ్లించడం వల్ల రైలు బోర్డింగ్ స్టేషన్ కు చేరని సమయంలోను, మీరు ప్రయాణిస్తున్న రైలు గమ్యస్థానం కాకుండా వేరే స్టేషన్కు వెళ్లిన సందర్భంలోనూ TDR ఫైల్ చేయొచ్చు. టికెట్ బుక్ చేసుకున్న ఏదైనా కారణంతో మీకు సీటు దొరక్కపోయినా మీరు TDR ఫైల్ చేసి రిఫండ్ కోరొచ్చు.
ఎలా చేయాలి?
#1 IRCTC వెబ్ సైట్/ యాప్ లోకి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
#2 మై అకౌంట్ సెక్షన్ లోని టికెట్ హిస్టరీ పై క్లిక్ చేయాలి.
#3 TDR ఫైల్ చేసుకోవాలనుకున్న PNR నంబర్ ను, పేరును ఎంపిక చేసుకోవాలి.
#4 ఫైల్ TDR ఆప్షన్ ను ఎంచుకోవాలి. TDR ఫైల్ చేసేందుకు కావాల్సిన కారణాన్ని ఎంపిక చేసుకొని ప్రక్రియను పూర్తి చేయాలి.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!