Advertisement
భారతదేశంలో ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినవాళ్లు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపు తో బిజీ అయిపోయారు. జూలై 31 ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపు కి లాస్ట్ డేట్. అందుకని ట్యాక్స్ కట్టేస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులకు ఒత్తిడి పెరగడంతో కొన్ని తప్పులుని చాలా మంది చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కమ్ రిటర్న్స్ ని చెల్లించేటపుడు బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేయాలి. వాటిని తప్పుగా ఇవ్వకుండా చూసుకోవాలి. వివరాలు వ్యాలిడేట్ అయ్యాక తప్పును ఎలా సరి చేసుకోలేక బాధ పడుతున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ గడువు సమీపిస్తోంది కనుక ఇలాంటి వివరాలు తప్పు కాకుండా చూసుకోవాలి. ఐటీఆర్ ఫారమ్‌లో తప్పు ఖాతా వివరాలను సరి చేయడానికి ఏం చెయ్యాలో చూద్దాం.
Advertisement
Advertisement
మొదట ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్‌లో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్ళండి.
ఈ పేజ్ కి ఎగువ ఎడమ వైపున నా ఖాతా ఉంటుంది నొక్కండి. ఆ తరవాత ‘సర్వీస్ రిక్వెస్ట్’ మీద నొక్కండి.
‘కొత్త అభ్యర్థన’, ‘అభ్యర్థన వర్గం’ కింద ‘సవరణ’ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడేమో ఇక్కడ ‘ఐటీఆర్ ఫారమ్ పర్టిక్యులర్‌లను మార్చండి’ మీద నొక్కండి. ఐటీఆర్ ‘అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్’ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
లాగిన్ చేసిన తర్వాత ‘బ్యాంక్ ఖాతా వివరాలను మార్చడం’ కనపడుతుంది. అవసరమైన సమాచారాన్ని ఇచ్చేయండి.
బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేసాక ఐటీఆర్‌ను మళ్లీ ధ్రువీకరించాలి. ఐటీఆర్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి నా ఖాతా నొక్కి… బ్యాంక్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి. అక్కడ అప్‌డేట్ చేయబడిన బ్యాంక్ ఖాతా పక్కన “రీ-వాలిడేట్” అని ఉంటుంది. దాని మీద నొక్కండి.
రీ-వాలిడేషన్ తర్వాత ఐటీఆర్ ప్రాసెస్ అవుతుంది. రీఫండ్ వస్తుంది.
Also read: