Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా మంచి హిట్ అయింది. కరుణాకరన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. లవ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. 25 సంవత్సరాలు అయ్యింది ఈ సినిమా వచ్చి. పవన్, కీర్తి రెడ్డి లవ్ ట్రాక్, కెమిస్ట్రీ, కామెడీ, ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే తొలిప్రేమ సినిమాలో కమెడియన్ గా నటించి ఆకట్టుకున్న ఈయన ఎవరో మీకు తెలుసా..? పవన్ కళ్యాణ్ స్నేహితులుగా ఆలీ, వేణుమాధవ్ వంటి వాళ్ళు నటించారు. ఆ గ్యాంగ్ లో నల్లగా ఉండే అతని పేరు జగన్. బొగ్గు శీను పాత్రతో బాగా పాపులర్ అయ్యారు.
Advertisement
అతను నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. ఈ సినిమా మొదట్లో ప్రేమలేఖని డీఎస్పి కూతురికి ఇచ్చి ఎక్కడ కొడతారు అని భయపడి దాక్కోవడం, అమ్మాయి ప్రేమించినట్లు చెప్పడంతో సాంగ్ లీడ్ తనతోనే స్టార్ట్ అవ్వడం వంటి సన్నివేశాలు ఇందులో ఉంటాయి. కరుణాకరన్ కి జగన్ బాగా కావాల్సిన వ్యక్తి. చెన్నైలో కరుణాకరన్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జగన్ సహాయం చేశాడు అప్పుడే తాను దర్శకత్వం వహించే మొదటి సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు. ఇలా తొలిప్రేమ సినిమాలో జగన్ నటించారు. మద్రాసులో ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు జగన్ ఆ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమాల్లో కూడా నటించలేదు. తాను నటించిన ఒకే ఒక సినిమా ఇది.
Also read:
- IND VS PAK మ్యాచ్ కోసం హోటల్ ని బుక్ చేసుకోవడానికి బదులు.. క్రికెట్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు అంటే..?
- 7/జి బృందావన్ కాలనీ హీరో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?
- బాహుబలి లాగే.. బెస్ట్ ట్విస్ట్ ఉన్న 13 సినిమాలు ఇవే..!