Advertisement
Kabjzaa Day 1 Collections: కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ “కబ్జా”. ఆర్ చంద్రు వ్రాసి దక్షకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించారు. తెలుగులో నిర్మాత ఎన్ సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్ లో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఇంతకుముందే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Advertisement
Read also: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?
కన్నడ నుంచి మరో కేజీఎఫ్ రాబోతుందంటూ పలువురు కామెంట్స్ కూడా చేశారు. స్వతంత్రానికి ముందు సాగే కథ కబ్జా. అనుకోని పరిస్థితులలో అండర్ వరల్డ్ తో యుద్ధానికి దిగే అరకేశ్వర అనే ఎయిర్ ఫోర్స్ సైనికుడి కధే ఈ చిత్రం. 136 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నంతలో భారీగానే రిలీజ్ అయింది. ఓపెనింగ్ షోలు పరవాలేదు అనిపించే విధంగా ఉన్నా తర్వాత టాక్ ఇంపాక్ట్ వలన స్లోడౌన్ అయిపోయింది. సినిమా మొత్తం మీద తొలి రోజునే నిరాశ కలిగించే కలెక్షన్స్ తోనే కంప్లీట్ చేసుకుంది. సినిమా మొత్తం మీద ట్రేడ్ లెక్కల్లో మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 1.45 కోట్ల దాకా గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుందని సమాచారం.
Advertisement
అందులో నుండి వర్క్ షేర్ 65 లక్షల దాకా ఉంటుందని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాల్యూ బిజినెస్ లెక్క.. 2.75 కోట్ల దాకా ఉంటుంది. ఇక కర్ణాటకలో మొదటి రోజు 8.45 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా.. టోటల్ గా ఇండియాలో 12.40 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుందని సమాచారం. పాన్ ఇండియా మల్టీస్టారర్ గా అంచనా వేసినప్పటికీ.. ఎవరిలోనూ అంత ఇంట్రెస్ట్ ను కలిగించలేకపోయింది ఈ చిత్రం. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ అయిన లొకేషన్స్ డాటా ప్రకారం 13.60 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. ఇక సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 45 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం ఎక్కడ పెద్దగా ఆడటం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రెండు మూడు రోజుల్లో కబ్జాను తీసివేయడం ఖాయమని అంటున్నారు.