Advertisement
మైత్రి మూవీ మేకర్స్.. టాలీవుడ్ లో లీడింగ్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది ఈ సంస్థ. మైత్రి నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న గీత ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్.. ఇలా పెద్ద బ్యానర్స్ ని దాటుకొని వరుస సినిమాలు, వరుస హిట్స్ తో ముందుకెళుతుంది మైత్రి మూవీ మేకర్స్. శ్రీమంతుడు సినిమాతో స్టార్ట్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రయాణం మూడు హిట్లు, ఆరు సక్సెస్ లతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సంస్థ చిక్కుల్లో పడింది. 8 ఏళ్లుగా యాక్టివ్ గా ఉన్న ఈ సంస్థపై తొలిసారి ఐటీ రైడ్స్ జరగడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయింది.
Advertisement
Read also: DASARA MOVIE OTT RELEASE DATE: “దసరా” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
Advertisement
ఈ సంస్థ ఆఫీస్, నిర్మాతల ఇళ్లలో ఐటి సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ ఈమధ్య పెద్దపెద్ద సినిమాలు నిర్మాణం చేయడం, అలాగే అందులో చాలా సినిమాలు ఘనవిజయం సాధించడంతో వారి ఆఫీస్ ల మీద ఈ సోదాలు నిర్వహించారు. అయితే ఈ సంస్థ చిక్కుల్లో పడడమే కాకుండా.. స్టార్ హీరోలను సైతం చిక్కుల్లో పడేసినట్టు తెలుస్తోంది. ఇటీవల స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇల్లు, కార్యాలయాలలోనూ ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. మైత్రి సంస్థ వారితో సుకుమార్ కి చాలా డీలింగ్స్ ఉన్నాయట. సుకుమార్ రైటింగ్ బ్యానర్ తో.. మైత్రి సంస్థ మిడ్ రేంజ్ సినిమాలను నిర్మించాలని భావిస్తుందట.. ఈ కారణంతోనే సుకుమార్ ఇంట్లో, ఆఫీస్ లపై రైడ్స్ చేసిన అనంతరం మైత్రి ఆఫీస్ లపై రైడ్స్ చేశారు.
అయితే ఈ సోదాలు వరుసగా ఐదు రోజులు జరగడం.. మైత్రి నిర్మాతలలో ఒకరైన నవీన్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ కావడం కూడా జరిగింది. అయితే ఈ సోదాలలో నిర్మాతల వాట్సప్ చాటింగ్ కూడా అధికారులు చెక్ చేశారట. ఏ హీరోకి ఎంత అడ్వాన్స్ ఇచ్చారు..? ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారూ..? అన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారట. ఈ విషయం తెలిసిన హీరోలు తమ లెక్కలను కూడా అడుగుతారా..? తమపై కూడా రైడ్స్ చేస్తారేమోనని తెగ టెన్షన్ పడుతున్నారట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.