Advertisement
నవంబర్ రెండవ తారీకు తెల్లవారు జామున సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుక డెస్టినేషన్ మ్యారేజ్ గా ఇటలీలో జరుగుతోంది. ఇప్పటికే పెళ్లి వేడుకల కోసం రెండు కుటుంబాల వారు ఇటలీకి చేరుకున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా మెగాస్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లు రకరకాలుగా ఫోటోలు తీసుకుని నెట్టింట్లో సందడి చేస్తున్నారు. అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఇటలీ వెళ్లారు.
Advertisement
కానీ, ఇప్పటివరకు ఆయన ఒక్క ఫోటో కూడా దిగినట్లు లేరు. సాధారణంగా పవన్ కళ్యాణ్ కొంచం ఇంట్రావర్ట్ గా ఉంటారు. ఎక్కువ మందితో కలవడం, ఫోటోలు దిగడం, పార్టీ కల్చర్ లో ఉండడం ఆయనకు పెద్దగా ఇంటరెస్ట్ ఉండదు. ఆయన చిన్నప్పటి నుంచి ఇంతే అని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కూడా పలు సార్లు చెప్పారు. అయితే.. ఈ ఈవెంట్ కి కూడా ఆయన హాజరు అయినప్పటికి ఇప్పటివరకు ఎవరితోనూ కలిసి ఫోటో దిగినట్లు లేరు అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఒక నెటిజెన్ అయితే ఏకంగా ఆయన ఫంక్షన్ లో ఫోటో తీసుకోకుండా ఏమి చేస్తూ ఉంటారో గెస్ చేసి ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరిని కలవకుండా రూమ్ లోనే ఓ చోట కూర్చుని సైలెంట్ గా పార్టీ చేసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. మరొకరు ఏమో మెగాస్టార్ ను టాగ్ చేసి.. బాసూ ఎక్కడ ఉన్నా పట్టుకుని పవర్ స్టార్ ని ఫోటోలు దిగమని చెప్పండన్నా అంటూ మరో పోస్ట్ పెట్టారు. ఇట్లా ఈ విషయమై పెట్టిన పోస్ట్ లు అన్నీ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అవి మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
Advertisement
#1
Whole Mega Family is Enjoying #VarunLav wedding
Meanwhile @Pawankalyan in Italy Room 🏃 pic.twitter.com/AYtzeWl3Vi
— ѕυииуραωαиιѕт ツ (@SunnyPawanist) November 1, 2023
#2
Silent ga room lo undedhaaniki Italy varaku travel cheyyaala anna @PawanKalyan 💆 pic.twitter.com/ZjnIqbDEyp
— Sanjay Sahu (@Bhaagi_) November 1, 2023
#3
Ekkada unnado pattukoni konni photo lu digamanu Boss please @KChiruTweets pic.twitter.com/VmELfMwv3H
— Finn (@KaroJaraJalsa) November 1, 2023
మరిన్ని..
రూల్స్ ని బ్రేక్ చేసిన చంద్రబాబు నాయుడు.. బెయిల్ రద్దు చెయ్యాలి అంటూ..?
విచిత్రంగా పెళ్లి పెటాకులు మహోత్సవాలు.. దానికి పెట్టిన ఈ వింత పేరుని చూసారా?
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడం వెనుక అసలేం జరిగింది? 28 రోజుల తరువాత మళ్ళీ జైలు కి వెళ్లాలా?