Advertisement
నందమూరి తారక రామారావు ని ఆంధ్రులు ఎంతగానో కొలుస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కొత్తగా మనం చెప్పుకోక్కర్లేదు. పైగా ఆయన రాజకీయాల్లో, సినిమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ పాపులర్ అయిపోయారు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు చేస్తూ, ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పట్లో తిరుపతికి వెళ్లిన వాళ్ళు రామారావుని చూడకుండా వస్తే పూర్తి దర్శనం కానట్లే ప్రచారం జరిగేదట అంతలా ఆయనకి అభిమానులు ఉండేవారు.
Advertisement
ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడానికి ముందు ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. రెండవ పెళ్లి కింద లక్ష్మీపార్వతిని కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని రామారావు అనుకున్నారు. ఎన్టీఆర్ చాలా మంది హీరోయిన్లు ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ ఎన్టీఆర్ హీరోయిన్స్ అందరినీ ఏఎన్ఆర్ సంవత్సరాల కొద్దీ కాల్ షీట్లు తీసుకోవడంతో ఎన్టీఆర్ కి హీరోయిన్ల కొరత కలిగింది.
Advertisement
దాంతో కృష్ణకుమారి అనే హీరోయిన్ ని తీసుకువచ్చారు ఎన్టీఆర్. ఆమె చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేవారు. ఎన్టీఆర్ ఎక్కువ ఆమెతో సినిమాలు చేసేవారు. కేవలం ఎన్టీఆర్ తోనే ఆమె ఎక్కువగా నటించేది. వాళ్ళ మధ్య సన్నిహిత్యం బాగా పెరిగింది. ఎన్టీఆర్ కి బాగా ఆమె నచ్చడంతో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.
అప్పటికే బసవతారకం బాలింతగా ఉన్నారు. కృష్ణకుమారితో సహజీవనం చేయాలని అనుకున్నారు. బసవతారకం కూడా ఈ విషయంపై అడ్డు చెప్పలేదు. కృష్ణకుమారి కూడా ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన చిన్నాయనకు చెప్పారు. అయితే చిన్నాయన త్రివిక్రమ రావు బైక్ మీద కృష్ణకుమారి ఇంటికి వెళ్లి ఆమెని తుపాకీతో బెదిరించారు. ఇక ఆమె భయపడి బెంగళూరు వెళ్ళిపోయింది. ఇలా పెళ్లి కాస్త ఆగిపోయింది. లేదంటే ఎన్టీఆర్ ఆమె ని పెళ్లి చేసుకు ఉండేవారు.
Also read: