Advertisement
Rana Naidu Web series Review: దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. ఇంతవరకు వీరిద్దరూ సినిమాల్లో కూడా కలిసి నటించలేదు. కానీ డైరెక్ట్ గా వెబ్ సిరీస్ లో కనిపిస్తున్నారు. గతంలో రానా హీరోగా చేసిన కృష్ణం వందే జగద్గురువులో వెంకీ గెస్ట్ గా కనిపించారు. ఈసారి ఓ వెబ్ సిరీస్ రూపంలో ఈ కాంబో మన ముందుకు వచ్చింది. అమెరికన్ డ్రామా సిరీస్ “రే డొనోవన్” ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ప్లిక్స్ ఇండియాలో విడుదల అయ్యింది. ఫ్యామిలీ, గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Rana Naidu Web series OTT Platform, Release Date, Streaming Rights
Read also: రాజమౌళి అమ్మగారు చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?
Rana Naidu Web series Story in Telugu కథ మరియు వివరణ:
రానా దగ్గుబాటి ఈ వెబ్ సిరీస్ లో రానా నాయుడుగా నటించారు. ఈయన ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీల సమస్యలను తీర్చే ఫిక్సర్. బాలీవుడ్ స్టార్స్ నుంచి క్రికెటర్ల వరకు ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా సమస్యలో చిక్కుకుంటే, ఆ సమస్యను పరిష్కరించేందుకు వారు రానా నాయుడును ముందుగా కాంటాక్ట్ అవుతారు. రానా నాయుడు తండ్రి నాగా నాయుడు( వెంకటేష్) 15 సంవత్సరాలు చంచల్ గూడా జైలులో శిక్షను అనుభవించి విడుదల అవుతారు. అయితే నాగా నాయుడికి, రానాకి అస్సలు పడదు. తండ్రి జైలు నుంచి విడుదల కావడం రానా నాయుడికి నచ్చదు. చివరికి నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడడు. రానాకి తేజ్ నాయుడు ( సుశాంత్ సింగ్) అనే అన్న, జఫ్ఫా నాయుడు ( అభిషేక్ బెనర్జీ) అనే తమ్ముడు ఉంటారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే నాగాని జైలుకు పంపింది అతని కొడుకే. అసలు ఈ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమిటి? నాగ నాయుడు ( వెంకటేష్) 15 సంవత్సరాలు ఎందుకు జైల్లో ఉంటారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు చూడాల్సిందే..
Advertisement
Read also: తమ్మారెడ్డి కి మెగా బ్రదర్ మరో కౌంటర్ ! అసలు వదట్లేదు గా..ఇది మాములు మాస్ కాదు !
రానా నాయుడు వెబ్ సిరీస్ 2013 లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సిరీస్ “రే డోనోవన్” కి రీమేక్ గా వచ్చింది. స్కాండిల్స్, సెకండ్ థాట్ లేకుండా పేలే గన్స్ తో, కుప్పలు తెప్పలుగా ఉండే డబ్బు చుట్టూ ఈ సిరీస్ అనర్గళంగా సాగుతోంది. న్యూయార్క్ కాస్త ఇక్కడ ముంబైగా రూపొందింది. ఇందులో రానా దగ్గుబాటి చాలా బాగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో రానా యాక్టింగ్ సినిమాకి ప్లస్ పాయింట్. అయితే ఈ కథ మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడనిది. ఇక ఫ్యామిలీ డ్రామాలతో ఇప్పటివరకు ఆకట్టుకున్న వెంకటేష్ ఈ సిరీస్ లో నోటి దూకుడుగా వ్యవహరించే సరికొత్త నటుడిగా మనం చూస్తాం. ఈ సిరీస్ తో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు వెంకటేష్. రానా భార్యగా నటించిన సుర్విన్ చావ్లా కూడా చాలా చక్కగా నటించింది. అభిషేక్ బెనర్జీ పోషించిన జఫ్ఫా పాత్రను బాగా రాశారు. ఇది రెగ్యులర్ యాక్షన్, క్రైమ్ వెబ్ సిరీస్ మాత్రమే కాదు..అడల్ట్ కంటెంట్, బూతులు కూడా ఈ సిరీస్ లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ ను ఫ్యామిలీతో చూడలేం. ఇక జాన్ స్టీవార్డ్ అందించిన సంగీతం, క్లైమాక్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అద్భుతంగా ఉంది. అయితే కొన్ని చోట్ల భారీ సన్నివేశాలతో సిరీస్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి ఎడిటింగ్ టీం వర్క్ ఇంకాస్త చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. చివరలో వచ్చే కొన్ని ఎపిసోడ్ లు ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్ :
రానా యాక్టింగ్
వెంకటేష్ పెర్ఫార్మెన్స్
కొత్తగా అనిపించే ప్లాట్
మైనస్ పాయింట్స్ :
చాలా చోట్ల వినిపించే బూతులు
స్లో నరేషన్
రెగ్యులర్ వ్యూవర్స్ కు డైజస్ట్ కాని కథ
రేటింగ్: 2.75/5
Read also: YS VIVEKANANDA REDDY: వివేకా హత్య కేసు లో మరో ట్విస్ట్ ! తెరపైకి మరో మహిళ ఎవరు ఆమె ?