Advertisement
మన దేశం నుంచి చాలామంది అమెరికా బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడ సంపాదించుకొని మళ్లీ ఇండియాకు వస్తూ ఉంటారు. కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉంటారు.. కానీ తమిళనాడు వాసులు మాత్రం ఎక్కువగా సింగపూర్,మలేషియా దేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. అవునండి మీరు విన్నది నిజమే.. అమెరికా,బ్రిటన్ కంటే మలేషియా,సింగపూర్ వీరికి నచ్చుతుందట.. అసలు కారణమేమిటో చూద్దాం..
Advertisement
క్రీస్తు శకం 11 వ శతాబ్దం లో తమిళ సాహిత్యంలోనే మలేషియా గురించిన వర్ణన ఉంది. కేదాహు అనే రాష్ట్రాల గురించి వివరాలను అప్పటి తమిళ సాహిత్యంలో చూడవచ్చు. క్రీస్తు శకం 11 వ శతాబ్దం లో తమిళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు మలేషియాకు వెళ్లారని చెబుతుంటారు. దీనివల్ల తమిళ ప్రజలు మలేషియాకు ఎక్కువగా వర్తకాలు జరిపే వారని దీని వల్ల మలేషియాకు తమిళ్ ప్రజలకు రానురాను సంబంధాలు పెరిగాయి.
తర్వాత బ్రిటిష్ వారి హయాంలో మలేషియాలో పనిచేసేందుకు పెద్ద ఎత్తున తమిళ ప్రజలు వలస వెళ్లేవారు.
Advertisement
కొంతమంది అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలంకలోని తమిళులు కూడా అక్కడ ఉన్నత స్థానంలో ఉద్యోగాలు కూడా చేసేవారట. కానీ అక్కడి ప్రజలు తమిళులను చిన్నచూపు చూసే వారని అంటుంటారు. దీని తర్వాత వీరు సింగపూర్ కి కూడా వలస వెళ్ళడం ప్రారంభించారు. అలా సింగపూర్ లో ఉన్న చాలామంది స్థిరపడ్డారు. దీనివల్ల ఎక్కువమంది పని కోసం సింగపూర్,మలేషియా వలస వెళ్లడం ప్రారంభించారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.
also read: