Advertisement
తెలంగాణాలో ఎన్నికల హడావిడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు నామినేషన్ల హడావిడి కనిపిస్తోంది. మరో వైపు నాయకులు, నేతల బహిరంగ ప్రచారాలు, సభలతో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అయితే.. ప్రజలు కూడా వారి సమావేశాల కంటే ఈ సారి ఏ నేతకు ఓటు వెయ్యాలి అనే విషయమై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరికీ ఎన్ని ఆస్తులు ఉన్నాయి.. ఈ ఐదేళ్ళలో ఎవరెంత సంపాదించుకున్నారు..? మా ప్రాంతం ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత? అన్న విషయాలను పరిశీలిస్తున్నారట. ఎన్నికల అఫిడవిట్ లో నేతలు ఆస్తుల వివరాలను సమర్పిస్తారు. వాటిపై మనం కూడా ఓ లుక్ వేద్దాం.
Advertisement
ఈ ఐదేళ్ళలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆస్తి విలువ ఐదు కోట్లు పెరిగింది. కాగా, ఆయన భార్య ఆస్తుల విలువను ముప్పై కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. వీటిలో స్థిరాస్తుల విలువ పాతిక కోట్లుగా ఉంది. ఇది ఇలా ఉంటె.. రేవంత్ రెడ్డిపై మొత్తం 87 కేసులు ఉన్నాయట. సగం కంటే ఎక్కువ కేసులు గత నాలుగు సంవత్సరాలలోనే నమోదు అవడం గమనార్హం. ఇక బండి సంజయ్ కు సొంత ఇల్లు లేదట. ఆయనకీ కానీ, ఆయన భార్యకి గాని ఎటువంటి భూములు లేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు. వారి ఆస్తుల విలువ 79 లక్షలుగా ఉన్నాయి. వీటిలో కారు, వెండి, బంగారం వంటివి ఉన్నాయి. సొంత ఇల్లు లేని నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి నేత బండి సంజయ్ పై 27 కేసులు ఉన్నాయి. 2019 ఎంపీ ఎన్నికల సమయంలో ఆయనపై 5 కేసులే ఉన్నాయి. ఇప్పుడు 27 కు పెరగగా.. వాటిల్లో చీటింగ్ కేసులు ఉన్నాయట.
Advertisement
కాగా, పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్న ఎర్రబెల్లి దయాకర రావు, ఆయన భార్య ఆస్తుల విలువ 58శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుత ఆస్తుల విలువ రూ.12.8కోట్ల రూపాయలు. వీటిలో స్థిరాస్తుల విలువ రూ.11.3 కోట్ల రూపాయలుగా ఉంది. 2018లో ఎర్రబెల్లి ఆస్తుల విలువ రూ.8.1కోట్ల రూపాయలు కాగా.. ప్రస్తుతం ఆయన భార్య ఆస్తుల విలువ రూ.16.6 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.98కోట్లగా ఉంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గద్దర్ కుమార్తె ఆమె భర్త ఆస్తుల విలువ యాభై ఎనిమిది లక్షలుగా ఉంది. ఇక AIMIM నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆస్తుల విలువ రూ.33.2 కోట్ల రూపాయలుగా ఉండగా.. కల్వకుర్తి నుంచి పోటీ చేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఆస్తి విలువ రూ.36.5 కోట్ల రూపాయలుగా ఉంది.
Read More: