Advertisement
సాధారణంగా పెళ్లి చేసుకొని సుఖ, సంతోషాలతో గడపాలని అనుకుంటారు ఎవరైనా? కానీ కొంత మంది పెళ్లి జరిగిన కొద్ది రోజులకే రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతూ.. తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. అలాగే ఓ నవ వధువు అదేవిధంగా అత్తగారింటికి అడుగుపెట్టింది. తనభర్తతో నూరేళ్లు కలిసి జీవించాలనుకుంది. కానీ అంతలోనే ఏమైందో తెలియదు.. ఉన్నట్టుండి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. పెళ్లి జరిగిన నెల రోజులకే తనువు చాలించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. వసంత్ నగర్ లో నివసిచే నరేష్ గౌడ్ కి గాజుల రామారం ప్రాంతానికి చెందిన నందిని(23)కి నెల రోజుల కిందట పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలు పూర్తయిన తరువాత నందినిని అత్తగారింటికి పంపించారు. ఆమె అకస్మాత్తుగా శనివారం రాత్రి ఆత్మ*త్యకి పాల్పడింది. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుంది. అయితే గదిలోకి వెళ్లిన నందిని ఎంతసేపటికి గదిలోనుంచి నందిని బయటికి రాకపోవడం.. ఎంత పిలిచినా పలకకపోవడంతో.. నందిని అత్త, భర్త తలుపులు తట్టి చూసి ఆశ్చర్యపోయారు. నందినిని కిందికి దించి చూడగా అప్పటికే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
Advertisement
దీంతో నందిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు పోలీసులు. నందిని చనిపోవడానికి కారణం ఏంటి ? అత్తింటి వారు ఏమైనా ఇబ్బంది పెట్టారా ? లేక వ్యక్తి గత కారణాలు, అనారోగ్య సమస్యలతోనా ? మరే ఇతర కారణమా ? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
అంత్యక్రియలు జరిగేటప్పుడు చితికి నిప్పంటించిన వ్యక్తి వెనక్కి చూడకూడదంటారు.. ఎందుకో తెలుసా ?