Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం 100కు పైగానే సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఇక డబ్బింగ్ సినిమాలు కలుపుకుంటే వాటి సంఖ్య దాదాపు 150 కి చేరుకుంటుంది. ఇక మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఎక్కువే. కానీ వారు ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనంగా మారిపోయింది. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ గతంలో మన హీరో, హీరోయిన్లు ప్రతి ఏటా పదికి పైగా సినిమాలతో జోరు చూపించేవారు. పోటాపోటీగా బాక్స్ ఆఫీస్ వద్ద వారి సత్తా చూపారు. అలా ఏడాదికి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: రిషబ్ శెట్టి మాత్రమే కాదు.. ఈ 10 మంది నటులు కూడా డైరెక్టర్లుగా సినిమాలు చేశారు..!
1) కృష్ణ.
సూపర్ స్టార్ కృష్ణ తన ఐదు దశాబ్దాల సినిమా కెరియర్ లో మొత్తం 350 కి పైగా సినిమాలలో నటించారు. 1970లో ఒకేసారి 16 సినిమాల్లో నటించారు. మరుసటి ఏడాది వాటిలో 11 సినిమాలు విడుదలయ్యాయి. ఇక 1972లో ఏకంగా కృష్ణ హీరోగా నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదు.
2) నందమూరి తారక రామారావు.
ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన రికార్డులో రెండవ స్థానం నందమూరి తారకరామారావు గారిది. 1964 లో ఈయన నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి.
3) కృష్ణంరాజు.
Advertisement
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలతో పోటీపడి ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసి రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 1974లో 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కృష్ణంరాజు.
4) రాజేంద్రప్రసాద్.
హీరోలు కూడా నవ్వించగలరని చూపించి కథానాయకుడి పాత్రకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్. ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలలో నటించారు. 1988లో మొత్తం 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
5) మెగాస్టార్ చిరంజీవి.
ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. 1980లో ఏకంగా 14 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు
6) జగపతిబాబు.
ఫ్యామిలీ హీరో జగపతి బాబు ఇప్పుడు విలన్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. జగపతిబాబు కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో ఒక సంవత్సరంలోనే ఆరు సినిమాలను విడుదల చేశారు.
7) బాలకృష్ణ.
నందమూరి నటసింహం బాలకృష్ణ 1987వ సంవత్సరంలో ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.