Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే ఎంతో పేరుగాంచిన దేవాలయం. ఇక్కడికి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు కూడా వస్తుంటారు. అలాంటి టీటీడీకి కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల జరిమానా విధించింది. మరి ఎందుకు విధించిందో ఇప్పుడు చూద్దాం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి హుండీలో ఎంతోమంది భక్తులు ఖరీదైన కట్న కానుకలు వేస్తూ ఉంటారు. భక్తులు ఎంత అమౌంట్ వేసినా ఏది వేసిన లెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో విదేశీ భక్తులు కూడా తిరుపతికి వచ్చినప్పుడు హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. ఇందులో చాలామంది విదేశీ కరెన్సీ కూడా సమర్పిస్తారు.
Advertisement
ALSO READ: బండి సంజయ్ అరెస్ట్ అటు రిమాండ్.. హైడ్రామా!
Advertisement
అయితే అలా వచ్చిన విదేశీ కరెన్సీని టీటీడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భారత కరెన్సీ లోకి మార్చుకుంటూ వచ్చేది. కానీ 2018 తర్వాత ఈ కరెన్సీ ని అలా మార్చుకోవడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించలేదు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ కరెన్సీని టిటిడి ఖాతాలో డిపాజిట్ చేయడానికి కూడా అంగీకరించలేదు. దీంతో 2018 నుంచి ఇప్పటివరకు ఆ విదేశీ కరెన్సీ పెద్ద మొత్తంలో పేరుకుపోయింది. ఇప్పుడున్న డబ్బు విలువ దాదాపుగా 30 కోట్లకు పైగానే ఉంటుందని టిటిడి చెబుతోంది.. అయితే 2018 వరకు విదేశీ భక్తులు వేసే విరాళాలను పొందడానికి టీటీడీ హోంశాఖ నుంచి FCRA చట్టం కింద లైసెన్స్ పొందింది. FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ ( రెగ్యులేషన్ ) యాక్ట్, 2010. ఈ చట్టం కింద విదేశీ కరెన్సీని RBI ఆర్బిఐ 2018 వరకు అనుమతించింది. అలా వచ్చిన డబ్బును ఎస్బిఐ కూడా టిటిడి ఖాతాలో జమ చేసేది.
కానీ 2018 తర్వాత లైసెన్స్ గడువు ముగిసిన టీటీడీ వారు దాని రెన్యువల్ చేసుకోలేదు. దీన్ని గుర్తించిన కేంద్ర హోంశాఖ ఎఫ్ సిఆర్ ఏ విభాగం 2019లో గుర్తించింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోకుండా టీటీడీ విదేశీ కరెన్సీ ద్వారా విరాళాలు సేకరించడం మీద రూ.1.14 కోట్ల జరిమానాను విధించింది. దీని ప్రకారం విదేశీ విరాళాల పై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు ఉపయోగించరాదు. కానీ టీటీడీ బోర్డు ఆ మొత్తాన్ని వినియోగించడం, ఆ వివరాలను సరైన ఫార్మాట్లో ఇవ్వకపోవడం వల్ల కేంద్రం రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీనివల్ల కేంద్రం టిటిడి పై మొత్తం విధించిన జరిమానా రూ.4.33 కోట్లకు చేరుకుంది.