Advertisement
చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది విటమిన్ సి లోపం వలన కూడా బాధపడుతూ ఉంటారు. అయితే విటమిన్ సి లోపం అని ఎలా తెలుసుకోవచ్చు..? విటమిన్ సి లోపానికి సంకేతాలు ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసం చర్మ సౌందర్యం కోసం తగినంత విటమిన్స్ కావాలి. విటమిన్ సి లోపం ఉంటే శరీరంలో కొన్ని సంకేతాలు కనబడతాయి. మరి విటమిన్ సి లోపం ఉంటే ఎలా తెలుసుకోవచ్చు..? ఇప్పుడు చూద్దాం. గోళ్లు ఉబ్బెత్తుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళలో గోళ్లు గుంటలు పడినట్లు, పెళుసుగా మారినట్టు కనపడతాయి.
Advertisement
కొందరిలో పల్చగా మారి తొందరగా విరిగిపోతూ ఉంటాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండడం కోసం విటమిన్ సి తగిన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి లోపిస్తే చర్మానికి కావాల్సిన కొల్లాజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. స్కిన్ పొడిబారిపోతుంది. ముడతలు కూడా ఏర్పడతాయి. విటమిన్ సి లోపం ఉన్నట్లయితే చిగుళ్ళు సమస్యలు కూడా వస్తాయి. చిగుళ్లలో వాపు రక్తస్రావం ఏర్పడుతుంది. దంతాలు బలహీనంగా మారిపోతాయి. కీళ్ల కణజాలలు ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ కావాలి.
Advertisement
Also read:
విటమిన్ సి లోపం వలన దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. విటమిన్ సి లోపం రక్తహీనతకు కూడా దారితీస్తుంది దీంతో రక్తం తగ్గిపోయి అలసిపోతారు. చిన్న పని చేయాలన్నా కూడా నీరసంగా ఉంటుంది. విటమిన్ సి లోపం వలన థైరాయిడ్ గ్రంధుల నుండి హార్మోన్లు అధికంగా శ్రవిస్తాయి. దీంతో హైపర్ థైరాయిడిజం ఏర్పడుతుంది గుండె దడ, బరువు తగ్గడం, ఆకలి పెరిగిపోవడం, భయపడటం, వణుకు వంటి సమస్యలు వస్తాయి. చర్మంపై చిన్న దెబ్బ తగిలిన తొందరగా మానిపోకుండా ఉంటుంది. రక్త స్రావం ఎక్కువ అవుతుంది చర్మంపై అక్కడక్కడ ముదురు ఎరుపు రంగు మచ్చలు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ విటమిన్ సి లోపం కి కారణాలు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!