Advertisement
ఎన్నో కలలు కని వాటిని నిజం చేసుకోవాలని చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. బ్రాగ్రౌండ్ లేకుండా కూడా చాలా మంది టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి హీరోలుగా ఎదిగారు. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఉదయ్ కిరణ్ తక్కువ టైం లోనే మంచి పేరు తెచ్చుకున్నారు మంచి హీరోగా ఎదిగారు. 2000లో చిత్రం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
Advertisement
ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. కేవలం 50 లక్షల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తే ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లని రాబట్టింది ఈ సినిమా. ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ఓవర్ నైట్ స్టార్ గా ఎదగలేకపోయాడు తర్వాత ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, నువ్వు నేను ఇలా పలు సినిమాలు చేశాడు.
Advertisement
కొన్ని ఏళ్లకే ఉదయ్ కిరణ్ మంచి హీరో అయిపోయాడు ఈ క్రమంలోనే మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత తో ఉదయ్ కిరణ్ కి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా 11 పెద్ద బ్యానర్లు ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. పది బ్యానర్లు కూడా సినిమాలని ప్రకటించాయి అయితే కొన్ని కారణాల వలన ఉదయ్ కిరణ్ సుస్మితల పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.
అయితే ఉదయ్ కిరణ్ ప్రవర్తన బాలేక పోవడంతోనే పెళ్లి క్యాన్సిల్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి సుస్మిత పెళ్లి ఒక పెద్ద వ్యాపారవేత్తతో జరిగింది. ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేస్తామన్న పెద్ద బ్యానర్లు అడ్వాన్సులని వెనక్కి తీసేసుకున్నాయి. తర్వాత క్రమంగా ఉదయ్ కిరణ్ కి ఆఫర్లు తగ్గిపోయాయి సినిమాల్లో రాణించలేకపోయాడు. ఉదయ్ కిరణ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు వచ్చాయి. డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు ఫైనల్ గా ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
Also read:
ఆదిపురుష్ లో హనుమతుడిగా నటించిన దేవ్ దత్త నాగే ఎవరు..? బ్యాగ్రౌండ్ ఏమిటి..?