Advertisement
మనుషుల్లో మాంసాహార ప్రియులు చాలామందే ఉన్నారు. అయితే.. మాంసాహారం శరీరానికి మదాన్ని పెంచుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే పండుగ వేళల్లో, పూజాది నియమాలు పాటించే సమయాల్లో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక సంప్రదాయాలను పాటించే భారతీయులలో చాలా మంది శ్రావణ, ఆషాఢ, కార్తీక మాసాలలో మాంసాహారాన్ని పూర్తిగా త్యజిస్తు ఉంటారు. ఇక కొందరి ఇళ్లల్లో పెళ్లి ముహుర్తాలు ఖరారు అయ్యాక.. పెళ్లి అయ్యే వరకు మాంసం ముట్టమని వధువు, వరుడు, వారి తల్లి తండ్రులు తీర్మానించుకుంటూ ఉంటారు.
Advertisement
ఇలా కారణం ఏదైనా, కొంతమంది రోజుల తరబడి మాంసాహారం ముట్టుకోరు. ఇలా కనీసం ఓ నెల రోజుల పాటు మాంసాహారం తీసుకోకుండా ఉంటె.. శరీరంలో ఏమి జరుగుతుందో ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకోండి. మాంసాహారం కాకుండా ఎక్కువగా శాఖాహారమే శరీరానికి మేలు చేస్తుంది. శాఖాహారంలో మొక్కలకు సంబంధించిన పదార్ధాలు మాత్రమే ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో దోహదం చేస్తాయి. పూర్తి శాఖాహారంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
Advertisement
శాఖాహారమే తీసుకోవడం వలన అధికంగా బరువు పెరగకుండా ఉంటారు. మాంసాహారంతో పోలిస్తే శాఖాహారంలో కాలరీలు తక్కువ. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. మరియు త్వరగా బరువు పెరగకుండా ఉంటారు. శాఖాహారమే తినడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. కూరగాయలు, నట్స్ , పండ్లు వంటివి తినడం వలన యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగానే పెరుగుతాయి. రోజంతా ఫుల్ ఎనర్జీ తో ఉంటారు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా బాగా తగ్గుతుంది. మాంసాహారంలో ఫ్రెష్ గా దొరికే చేపలు ఆరోగ్యకరమే అయినప్పటికీ.. ప్రాసెస్ చేయబడిన మాంసాహారం ఆరోగ్యానికి కీడు చేస్తుంది.