Advertisement
సాధారణంగా మన ఇంట్లో పెద్దలు కొన్ని అనకూడని మాటలు మాట్లాడినప్పుడు.. అలా అనకూడదు పైన తథాస్తు దేవతలు ఉంటారు.. వాళ్లు తథాస్తు అన్నారంటే అది జరిగిపోతుంది అని అంటుంటారు.. మరి నిజంగానే ఆ దేవతలు ఉన్నారా.. అనే విషయాలు చూద్దాం.. మన పురాణాల ప్రకారం తథ అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనం ఏదైనా అనరాని మాటలు పదేపదే అంటే పైన దేవతలు తథాస్తు అంటారట. ఇలా తథాస్తు అనే వారినే తథాస్తు దేవతలు అని పిలుస్తారు.
Advertisement
Also Read: VASTU: ఉగాదిలోగా వీటిని తొలగించకుంటే సమస్యలే..?
సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. అలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరిని తథాస్తు దేవతలని , దేవత వైద్యులని అంటారు. వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారట. వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ వేదమంత్రాలు జపిస్తూ ఉంటారట. యాగాలు యజ్ఞాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారట.
Advertisement
Also Read:వైసీపీ గాలికి కొట్టుకొచ్చిందట!
ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తథాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట. అయితే వీరు ఎక్కువగా సంధ్యా సమయంలో సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అందుకే మన పెద్దోళ్ళు సాయంత్రం పూట ఏం మాటలు అవి అంటారు. ఏదైనా మనం చెడుగా వింతగా మాట్లాడితే అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందట. మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులు కానీ చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తథాస్తు నమ్ముతూ ఉంటారు.
Also Read: బండి సంజయ్.. ఇకనైనా మారతారా?