Advertisement
పెళ్లి అన్న బంధం అందరికి ఓ కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. చాలా మంది మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఓ వయసు వచ్చే వరకు ఇష్టపడరు. ముఖ్యంగా టీనేజ్ వయసు దాటి జాబ్ లైఫ్ లోకి కొత్తగా అడుగుపెట్టిన వారు జీవితాన్ని తమకు నచ్చినట్లు ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటారు తప్ప అప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకోరు. అయితే ఇందుకు విరుద్ధంగా కొందరు మాత్రం పెళ్లి చేసుకోవాలని, తమ జీవితంలోకి ఒక తోడుని తెచ్చుకోవాలని కోరుకుంటారు. ఇంతకీ మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కారణాలు సాధారణంగా ఏమి ఉంటాయో ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకోండి.
Advertisement
చాలా మంది డబ్బుని పొదుపు చేయడం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఒంటరిగా ఉండే మగవాళ్ళు ఖర్చు చేస్తారు తప్ప పొదుపు గురించి ఆలోచించరు. కానీ ఓ కుటుంబం వచ్చాక బాధ్యత పెరుగుతుంది. డబ్బుని ఆదా చేసుకోవాలన్న ఇది పెరుగుతుంది. అలాగే.. పెళ్లి చేసుకుంటే సమాజంలో వచ్చే గౌరవం కోసం కూడా కొందరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఆడవారు పెళ్లి చేసుకోకపోయినా కావాలనుకుంటే ఒక బిడ్డని దత్తత తీసుకుని అయినా సింగల్ పేరెంట్ గా ఉండగలరు.
Advertisement
కానీ మగవారు ఇలా ఉండలేరు. అందుకే.. తమకంటూ ఒక కుటుంబం కోసం కొందరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పిల్లలని, కుటుంబాన్ని కావాలనుకునే మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఆశపడతారు. ఇక కొందరు మగవాళ్ళు కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇలా ఒత్తిడితో పెళ్లి చేసుకున్న వారు దాంపత్య జీవితాన్ని అంత ఎంజాయ్ చెయ్యలేరు. మగవారిలో కూడా ప్రేమని కోరుకునే వారు ఉంటారు. తమకంటూ ఓ మనిషి ఉండాలని కోరుకునే వారు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
మరిన్ని..
గురపత్వంత్ సింగ్ కి గూబ గుయ్యిమనిపించేలా బుద్ది చెప్పిన భారత్ ! దెబ్బ అదుర్స్ కదు !
భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి..!
చంద్రబాబు గారు విడుదల అవ్వాలంటే చివరగా మిగిలింది ఈ ఒక్క మార్గమేనా ? రంగం లోకి..!