Advertisement
Zincovit Tablet Uses Telugu: ఈ టాబ్లెట్ పేరును మీరు వినే ఉంటారు. మెడికల్ షాపులలో ఎక్కువగా సేల్ అయ్యే టాబ్లెట్లలో ఇది ఒకటి. ఈ టాబ్లెట్ జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. అయితే ఈ టాబ్లెట్ ని ఎందుకు వాడాలి..? ఎవరు వాడాలి..? ఈ టాబ్లెట్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి..? దుష్ప్రభావాలు ఏంటనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
ఈ జింకోవిట్ టాబ్లెట్లు విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి5, బి6, బి12 సి, డి3, ఈ, అలాగే ఫోలిక్ ఆసిడ్ వంటి పదార్థాలను కలిగి ఉంటాయి. అలాగే జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. ఈ జింకోవిట్ టాబ్లెట్స్ ని ప్రధానంగా చర్మ వ్యాధులు, జుట్టు ఊడే సమస్య, రక్త పోటు, గర్భం సమస్యలు, కంటి సమస్యలకు ఉపయోగిస్తారు.
Advertisement
Zincovit Tablet Uses in Telugu: జింకోవిట్ తో పరిష్కారమయ్యే సమస్యలు:
- జీవక్రియను మెరుగుపరుస్తాయి
- ఆకలిని మెరుగుపరుస్తాయి
- జుట్టు ఊడడం తగ్గిపోతుంది
- చర్మవ్యాధులు తగ్గిపోతాయి
- బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది
- కంటి సమస్యలు నయం అవుతాయి
- బరువు పెరుగుతారు
- గర్భం సమస్యలు తీరతాయి
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జింకోవిట్ తో కలిగే దుష్ప్రభావాలు:
- కండరాల నొప్పి
- నోరు పొడిబారడం
- నిద్రలేమి సమస్యలు
- అలర్జీ
- వికారం మరియు వాంతులు
- మలబద్ధకం
ఈ సమస్యలు ఉన్నవారు జింకోవిట్ టాబ్లెట్స్ ని తీసుకోవద్దు:
- కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి
- కిడ్నీ వ్యాధి
- క్రోమియం కండరము లోపల ఇంజక్షన్
- కోతలు
- దెబ్బతిన్న లేదా ఎర్రబడిన చర్మం
- క్రోమియం ఇంట్రా వీనస్ ఇంజక్షన్
- అలర్జీ ప్రతిచర్యలు
- ఔషధ అసహనం
ఇక పిల్లలకి పాలు పట్టే తల్లులు ఈ టాబ్లెట్స్ ని జాగ్రత్తగా వాడాలి. వైద్యులు సిఫారసు చేస్తేనే ఈ టాబ్లెట్స్ ని వాడాలని సూచిస్తున్నారు. అలాగే ఈ టాబ్లెట్స్ ని వాడేటప్పుడు మద్యం సేవించకూడదు. అలాగే సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా, డాక్టర్ అనుమతి లేకుండా ఎక్కువ కాలం వీటిని తీసుకోకూడదు.