Advertisement
ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూ ఉంటేనే ఆ వ్యక్తికి పేరు గుర్తింపు ఉంటుంది. ఒకవేళ సినిమాలు లేకపోతే మాత్రం జనాలు మర్చిపోతారు.. కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ డైరెక్టర్ ను సినిమాలు చేయకపోయినా కానీ జనాలు ఎంతో గుర్తు పెట్టుకుంటారు.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే రాంగోపాల్ వర్మ.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా శివ.. ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఎన్ని జిమ్మిక్కులు చేశాడో మీరంతా చూసే ఉంటారు.
Advertisement
ఈ చిత్రంలో హీరో నాగార్జున అయినప్పటికీ నాగార్జునతో సమానంగా పేరు తెచ్చుకున్న నటుడు జె.డి చక్రవర్తి అని చెప్పవచ్చు. ఆయన ఎంత ఫేమస్ అయ్యారంటే చక్రవర్తిగా ఉన్న ఆయన పేరు జె.డి చక్రవర్తిగా మారిపోయింది. అయితే ఈ చిత్రానికి ముందుగా చక్రవర్తిని అనుకోలేదట.. రాంగోపాల్ వర్మ ఈ సినిమాలో నెగిటివ్ స్టేట్స్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. అదే టైంలో సినిమాలో కొన్ని సీన్లని టెస్ట్ షూట్ చేసి ఎవరైనా ఆర్టిస్టు కావాలని చూస్తున్న సమయంలో గుణశేఖర్ తన ఫ్రెండ్ వినోద్ బాలను తీసుకువచ్చారట.
Advertisement
దాంతో టెస్ట్ షూట్ చేసిన వర్మ ఆ షూటింగ్ అయిపోయాక ఈయన బాగా చేస్తున్నాడు సినిమాలో ఇతడు క్యారెక్టర్ ఫైనల్ చేయండని చెప్పాడట. దీంతో వినోద్ చాలా సంతోషపడ్డారు. కానీ నెక్స్ట్ డే చక్రవర్తిని ఓ సందర్భంలో చూసిన రాంగోపాల్ వినోద్ నాగార్జున కంటే హైట్ తక్కువగా ఉన్నారు, అతడి ప్లేసులో చక్రవర్తిని తీసుకుందామని చెప్పడంతో వినోద్ బాలకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో ఆయన చాలా నిరుత్సాహపడ్డారట. ఆ తర్వాత ఆంధ్ర వాలా, శివమణి లాంటి సినిమాల్లో వినోద్ బాల నటించినప్పటికీ ఆయనకు గుర్తింపు రాలేదు.
also read: