Advertisement
గత కొంతకాలంగా తెలుగులో నటి పవిత్ర లోకేష్ పేరు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా నరేష్ మరియు పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. ఇక ఈ జంట కొత్త సంవత్సరం రోజున త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. వారు ప్రకటన చేసిన విధంగానే పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు . ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అలాంటి పవిత్ర లోకేష్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read: Apollo Fish in Telugu: అపోలో ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?
ఈమె కన్నడలో టెలివిజన్ యాక్టర్ గా కెరియర్ ప్రారంభించి, కన్నడలో కొన్ని చిత్రాల్లో కూడా హీరోయిన్ గా చేసింది. ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్ లో చాలా ఫేమస్ అయింది. కర్ణాటకలోని మైసూర్ లో పుట్టిన ఈమె తండ్రి మైసూర్ లోకేష్, కన్నడ స్టేట్ కం ఫిల్మ్ యాక్టర్.. తండ్రి నటనా అనుభవంతోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. 45 ఏళ్ల పవిత్ర పదహారేళ్ళకే సినీ రంగ ప్రవేశం చేసింది. 1994 లో అంబరీష్ హీరోగా నటించిన మిస్టర్ అభిషేక్ చిత్రంలో నటించింది.పవిత్రకు అందం,అభినయం, నటన, టాలెంట్ ఉన్నప్పటికీ కాస్త పొడవుగా ఉంటుంది.
Advertisement
also read:
కాబట్టి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు.5.10 అంగుళాల పొడవు ఉండటం పవిత్ర లోకేష్ హీరోయిన్ అవకాశాలకు గండిపడేలా చేసింది. ఈమె కన్నడలో దాదాపు 150 కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ముందుగా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని, ఆయనతో మనస్పర్ధల కారణంగా కన్నడ నటుడైన సుచింద్రప్రసాద్ మరో వివాహం చేసుకుంది. 2018లో అతని నుంచి దూరంగా ఉంటూ సీనియర్ నటుడైన నరేష్ కు దగ్గరయింది. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ మూడు ముళ్ళు ఏడడుగులతో ఒకటయ్యారు.
also read: పాలిటిక్స్ కోసమే మౌనిక రెడ్డితో వివాహమా ? అనే కామెంట్స్ కి మంచు మనోజ్ ఇచ్చిన ఆన్సర్ అదుర్స్ !