Advertisement
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కి ఎంపికైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్ సినిమా విడుదలైనప్పటి నుంచి చాలా ఫేమస్ అవ్వడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకోవడం మన దేశానికి గర్వకారణంగా చెప్పవచ్చు. అలాంటి ఈ పాటకు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ ఎల్ సీ)లో ఇండియా మహారాజాస్ తరఫున ఆడుతున్న భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఇద్దరూ కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
ఈ వీడియోను ఎల్ఎల్ సి అధికారిగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. నేను చెప్తున్నా కదా.. అవి స్వీట్ ఫిట్ ” అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇటీవల జరిగిన 95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు అవార్డు లభించిన సంగతి మనందరికీ తెలుసు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి పాడిన ఈ పాట ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి స్వరపరిచారు. లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. అయితే ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
also read: ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కాదు ఆస్కార్ రావడానికి వెనక ఉంది కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే ?
దీంతో ఆర్ఆర్ఆర్ టీంకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ పాట దేశం మొత్తం మార్మోగిపోతుంది. అంతే కాకుండా లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా బుధవారం రోజు ఇండియా మహారాజాస్ వరల్డ్ జేయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజాస్ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. సురేష్ రైనా (49) రాణించిన మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో ఈ జట్టు 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేశారు.