Advertisement
స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో అన్ని పాత్రలకి నటీనటులు అందరూ న్యాయం చేశారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ.
Advertisement
Read also: DASARA MOVIE OTT RELEASE DATE: “దసరా” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేశవ పాత్రలో చేసిన అతని పేరు జగదీష్ ప్రతాప్ బండారి. పక్కా తెలంగాణ కుర్రాడు. పుట్టి పెరిగింది అంతా జయశంకర్ భూపాలపల్లి. ఇదిలా ఉంటే.. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మిగతా దర్శకుల కంటే సుకుమార్ దగ్గర ఎక్కువ లాజిక్స్ ఉంటాయి. అలాంటి దర్శకుడు కూడా పుష్ప సినిమాలో చిన్న మిస్టేక్ చేయక చెప్పలేదు. ఆ చిన్న మిస్టేక్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేంటంటే.. అల్లు అర్జున్ మొదటిసారి కేశవ తో కలిసి కార్ ఎక్కుతాడు.
Advertisement
మళ్లీ ఆ కార్ దిగేటప్పుడు డోర్ ఎలా తీయాలో తెలియక కేశవ కాస్త అయోమయానికి గురవుతాడు. దీంతో మరో వ్యక్తి వచ్చి ఆ కార్ డోర్ తెరుస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఈ చిత్రంలో హీరో ఒక సందర్భంలో వ్యాన్ కొనుక్కోవాలి అని అనుకుంటాడు. అందుకోసం హీరో ఫ్రెండ్ కేశవ కి ఈ విషయం చెప్పి వ్యాన్ కొనుక్కురమ్మని చెప్తాడు. హీరో చెప్పినట్లుగానే కేశవ వ్యాన్ కొనుక్కొని వస్తాడు. అయితే అంతకుముందు కేశవ్ కి డోర్ తీయడం రాదు అన్నట్టు చూపిస్తారు. అంటే కేశవ కి వ్యాన్ అలవాటు లేదు అని మనం అర్థం చేసుకోవాలి.
Read also: RANGAMARTHANDA : హ్యాట్సాఫ్ టూ కృష్ణ వంశీ
కానీ ఆ తర్వాత మాత్రం వ్యాన్ డ్రైవ్ చేస్తూ వస్తాడు. ఇక్కడే సుకుమార్ మిస్టేక్ చేశాడని, డోర్ కూడా తీయడం తెలియని కేశవ కారు కొనుక్కొని డ్రైవింగ్ చేస్తూ ఎలా వస్తారని ప్రేక్షకులు చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ లో ఓ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. పార్ట్ 2 లో కేశవ పాత్ర కీలకమైనదిగా నిలువనుందట. ఇందులో కేశవ పాత్రకు ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.
Read also: BALAGAM OTT: “బలగం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!