Advertisement
ఒకప్పుడు ఫోటో దిగాలి అంటే డబ్బున్న వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేది. ఒకవేళ పల్లెటూరులో ఉండేవారు పెళ్లి చేసుకుంటే ఒకటో, రెండో ఫోటోలు దిగి వాటిని ఫ్రేమ్స్ చేసుకొని అవి చూస్తూ మురిసిపోతుండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఫోటోలు అనేవి సులువు అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ కెమెరా ఉంటోంది. అలాంటి మనిషి పుట్టినప్పటినుంచి చచ్చేవరకు చేసే ప్రతి కార్యక్రమంలో ఫోటోషూట్ చేస్తున్నారు..
Advertisement
అలా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ట్రెండ్ అవుతున్నారు. అలాంటి ఓ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడు తరాలకు చెందిన మహిళలు అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మలు ఒకేసారి గర్భం దాలిస్తే ఎలా ఉంటుందన్న ఊహకు ప్రతిబింబంగా ఈ వీడియో నిలిచింది. ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఫోటోగ్రాఫర్ అయిన బిబిన్ అతని భార్య చింజు ఇటీవలే ప్రెగ్నెంట్ అని తెలిసింది.
Advertisement
also read:జియో యూజర్లకు శుభవార్త.. సరికొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్స్..!!
దీంతో ఇరు కుటుంబాలు సంతోషంలో ఉన్నారు. తన భార్య ప్రెగ్నెంట్ ఫోటోషూట్ భిన్నంగా ఉండాలని ఆలోచించాడు. దీంతో ఇంట్లో వారందరిని ఒప్పించి, వీరంతా వీడియోలో గర్భం దాల్చినట్టు కనిపించేలా వీడియో మరియు ఫోటోషూట్ చేశారు. అలా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మలు ఒకేసారి గర్భం దాల్చినట్టు క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశాడు.
also read: