Advertisement
కేరళలో కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో, రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాము అని చెప్తూ తీసిన సినిమా ఇది కేరళ స్టోరీ. ఈ సినిమా టీజర్ రిలీజ్ నుంచి కూడా సినిమాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆదాశర్మ, సిద్ది ఇదాని, యోగితా… పలువురు ముఖ్య పాత్రలో నటించగా సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు.
Advertisement
ది కేరళ స్టోరీ సినిమా మే 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. కేరళ స్టోరీ సినిమా వివాదాల నేపథ్యంలో అందరూ ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని ఎదురు చూడటం ప్రారంభించారు.
Advertisement
థియేటర్లలో వివాదాలు, షోస్ క్యాన్సిల్ చేయడం వంటి సంఘటనల దృష్ట్యా సినిమాని ఓటీటీ రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమో అని మేకర్స్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ది కేరళ స్టోరీ ఓటిటి పార్ట్నర్ ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. జీ5 లో కేరళ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అంటున్నారు. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. విడుదలైన తర్వాత నాలుగు నుంచి ఆరువారాల్లో ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :