Advertisement
కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలు తోనే పాపులర్ అయిపోతూ ఉంటారు. తర్వాత అవకాశాలు రాకపోవడం లేదంటే పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతోనో సినీ ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఆ తర్వాత చాలా కాలానికి సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు కనపడటం లేదంటే ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వడం వంటివి చూస్తూ ఉంటాం. చాలామంది టాప్ హీరోల పక్కన నటించిన కళ్యాణి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం వంటి సినిమాలతో ఆమె మెప్పించింది.
Advertisement
Advertisement
సత్యం వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన సూర్యకిరణ్ ని పెళ్లి చేసుకుంది. అయితే అంతా బాగానే ఉండేది. ఇద్దరు కూడా ఈవెంట్లకి వెళ్లడం ఇలా వాళ్ళ మధ్య అంతా బాగానే ఉండేది. కానీ సడన్ గా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఆర్థిక సమస్యలు అని ఫైనల్ గా తెలిసింది. సూర్య కిరణ్ చెల్లెలి పేరు సుజిత. ఈమె కూడా నటే. తాజాగా ఇంటర్వ్యూలో సూర్య కిరణ్ కళ్యాణి విడిపోవడానికి కారణాలు చెప్పింది. వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆర్థిక సమస్యలే కారణమని ఆమె చెప్పింది.
Also read: