Advertisement
సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బెల్లి ఫ్యాట్ తో బాధపడే వాళ్లు ఇలా ట్రై చేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి ప్రతీరోజూ వ్యాయామం చేయడం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవడానికి ఈ పానియాలు కూడా మీకు సహాయపడుతాయి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే జీవక్రియ పెంచవచ్చు. నిమ్మకాయలోని ఫైబర్ ఆకలి కోరికలతో పోరాడుతుంది. పొట్టని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇలా మీరు పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీ కూడా ఇందుకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీని తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది.
Advertisement
అల్లం టీ కూడా ఇందుకు అద్భుతంగా పని చేస్తుంది. కొవ్వును కరిగించడానికి అల్లం టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క టీ కూడా మీకు పని చేస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటి ఇన్ ప్లమెంటరీ గుణాలు పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తాయి. సోంపులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకలిని సోంపు తగ్గిస్తుంది. సోంపును తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వూ ఈజీగా తొలగిపోతుంది. సోంపుని నీళ్లలో వేసుకొని తీసుకోవచ్చు. సోంపుతో చక్కగా టీ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ పానియాల ద్వారా ఈజీగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవచ్చు.
Also Read :
ఉలవల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే తినకుండా ఉండరు..!