Advertisement
మోమోస్ అంటే చాలా మందికి ఫేవరెట్ స్నాక్. సాయంత్రం అయితే చాలు కడుపులో వచ్చే క్రేవింగ్స్ కు మోమోస్ తోడైతే ఆత్మారాముడు శాంతిస్తాడు. అయితే.. ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉన్న వారు అయితే.. కచ్చితంగా వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను తెలుసుకోవాల్సిందే. మోమోస్ లో వెజ్ మరియు నాన్ వెజ్ రెండు రకాలుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా రోడ్ సైడ్ స్టాల్స్ లో తక్కువ ధరలకే లభిస్తూ ఉంటాయి.
Advertisement
దొరుకుతున్నాయి కదా అని ఇష్టంగా తెగ లాగించేయమాయకండి. ఆ తరువాత తిన్నది అరగక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీటిని మైదా పిండితో తయారు చేస్తారు కాబట్టి. ఈ పిండితో చేసిన ఏ పదార్ధాలు అయినా త్వరగా అరగవు. అందులో మోమోస్ ను ఆవిరితో ఉడికించి చేస్తారు. ఈ పని శుభ్రంగా చేయకపోయినా.. సరిగ్గా ఉడికించకపోయినా లేని పోనీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా అని వేయించిన మోమోస్ ను తినడం కూడా అంత శ్రేయస్కరం కాదు.
Advertisement
మోమోస్ లో వేసే ఫిల్లింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లో కూరగాయలు లేదా నాన్ వెజ్ ను ఫిల్లింగ్స్ లో వాడతారు. ఇవి సరిగ్గా ఉడికించకపోయినా లేని పోనీ సమస్యలు వస్తాయి. సరిగ్గా ఉడకని, శుభ్రంగా తయారు చేయని మోమోస్ ను తినడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు రావడం వంటివి జరుగుతాయి. వీటిల్లో నంచుకోవడానికి ఇచ్చే సాస్, చట్నీల కారణంగా అధిక రక్తపోటుతో పాటు గుండెపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని..