Advertisement
సినిమాలలో రాజకీయ నాయకులపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేయడం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. తాజాగా నేడు విడుదల అయిన స్కంద సినిమాలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు అనిపిస్తుంది. ఎక్కువగా బాలయ్య సినిమాల్లో ఈ పొలిటికల్ సెటైర్స్ కనిపిస్తాయి. వీర సింహ రెడ్డి సినిమాలో కూడా ఇలానే చాలా సెటైర్లు సినిమాతో సంబంధం లేకుండా కనిపించాయి. ఈ సినిమాకు మాటలు అందించినది సాయి మాధవ్ బుర్రా. వీటి గురించి దర్శకుడు గోపిచంద్ మలినేని ని అడిగితే.. అవి సినిమాలో భాగమే అని చెప్పారు. ఇంకా బాలయ్య అఖండ సినిమాలో కూడా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కనిపిస్తాయి.
Advertisement
ఇవి కూడా చదవండి: Chandramukhi Review: మొదటి పార్ట్ కంటే ”చంద్రముఖి 2” బాగుందా..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!
ఇక బోయపాటి శ్రీను కూడా టీడీపీ పార్టీ అనుకూలుడే. టీడీపీ హయాంలో ఆయన ప్రభుత్వ ప్రమోషనల్ వీడియోస్ ను తెరకెక్కించారు. ఆయన సినిమాలలో పొలిటికల్ డైలాగ్స్ అంటే అవి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. స్కంద సినిమా సెకండ్ ట్రైలర్ లో కనిపించిన డైలాగ్స్ అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. “ప్రతి మనిషికి ఓ పేరు, ప్రతి ఊరుకో గౌరవం.. అది వదిలేసి మీరిద్దరూ తీసిన పరువు, కూల్చిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి..” అని రామ్ చేత చెప్పించారు. సి ఎం అయినా ఆ పదవి గౌరవం తగ్గేలా జగన్ ప్రవర్తిస్తున్నారు అంటూ ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసినట్లు అయ్యింది.
Advertisement
ఇవి కూడా చదవండి: బంగాళాదుంప చిప్స్ ని కనిపెట్టింది ఎవరో తెలుసా? అసలు వీటి స్టోరీ ఏంటంటే?
ఇవి కూడా చదవండి: Skanda Review and Rating in Telugu: స్కంద సినిమాతో రామ్ హిట్ కొట్టేశాడా..? కథ, రివ్యూ & రేటింగ్…!
మరో డైలాగ్ లో రామ్ నేను కూడా సీఎం అయిపోతే.. అదేమీ పెద్ద కష్టం కాదు.. తాగించి, తినిపించి, బెదిరిస్తే సీఎం అయిపోతారు అంటూ పంచ్ వేస్తాడు. ఇక సీబీఎన్ అరెస్ట్ పై కూడా డైలాగ్స్ కనిపిస్తున్నాయి. పరిస్థితులకు తలవంచి తప్పు చేసానని మీరు ఒప్పుకున్నా, చట్టం ఒప్పుకున్నా, చివరకు ధర్మం ఒప్పుకున్నా.. ఆ దైవం మాత్రం ఒప్పుకోదు సర్..” అంటూ వచ్చే ఓ డైలాగ్ సిబిఎన్ ను ఉద్దేశించి రాసారనిపిస్తుంది. ఆయన అరెస్ట్ అక్రమం, పైన దేవుడు అన్నీ చూస్తారు అని చెప్తున్నట్లు అనిపిస్తుంది.