Advertisement
ఆస్ట్రేలియా ఓటమి అంచులదాకా వెళ్తుంటే.. తన ఒంటరి పోరాటంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ గెలిపించాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ప్రపంచ కప్ పోరులో భాగంగా అఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియాకు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సమయంలో మాక్స్ వెల్ కు తొడ కండరాల నొప్పి భరించలేనంతగా వచ్చి వేధించింది. అయినా సరే నొప్పిని భరిస్తూ తన బ్యాటింగ్ ని కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో అతను 128 బంతుల్లో 201 పరుగులు చేసి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ప్రస్తుతం అతనిపై సోషల్ మీడియాలో విశేషంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
Advertisement
అసలు ఇప్పుడు అందరికి ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే.. నిన్న మ్యాచ్ లో తీవ్రనొప్పితో బాధపతున్న మాక్స్వెల్ ఎందుకు రన్నర్ ని పెట్టుకోలేదు ? దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? అసలు కండరాలు పట్టేసి.. నడవలేక మైదానంలోనే కింద పడిపోయి పరిగెత్తలేని స్టేజి లో ఉండి కూడా అలానే ఎందుకు బ్యాటింగ్ కొనసాగించాడు? అతనికి ఎందుకు బై రన్నర్ రాలేదు అన్న ప్రశ్న చాలా మందికే కలుగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8.2 ఓవర్ల వద్ద 49 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ టైం లో మాక్స్ వెల్ ఎంట్రీ ఇచ్చాడు.
Advertisement
కొంత సేపటికే లబుషేన్ రన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టాయినిస్, స్టార్క్‌లు కూడా ఎక్కువ సేపు ఉండలేదు. అంటే 91 పరుగులకే ఆస్ట్రేలియాకు ఏడు వికెట్లు పడిపోయాయి. ఇలాంటి స్టేజి లో మాక్స్ వెల్ ఆటని తన చేతిలోకి తీసుకుని ఇన్నింగ్స్ ను చేసుకుంటూ వచ్చాడు. అయితే 147వ రన్ వద్ద ముప్పై ఐదవ సింగల్ తీస్తున్న సమయంలో అతనికి ఉన్నట్లుండి తొడ వెనక నుంచి మోకాలి కింద వరకు ఉండే కండరాల్లో నొప్పి (హామ్‌స్ట్రింగ్ నొప్పి) మొదలైంది. ఆ నొప్పి వల్లే మాక్స్ వెల్ పరుగులు తియ్యలేక మైదానంలోనే పడిపోయాడు. అప్పటికప్పుడు ఆస్ట్రేలియా ఫిజియోథెరపిస్ట్ వచ్చి అతనికి రిలీఫ్ ఇచ్చే విధంగా చేసినా.. అతను నొప్పిని భరిస్తూనే ఆడాడు. అతని స్థానంలో ఆడదానికి ఆడమ్ జంపా సిద్ధం అయినప్పటికీ.. మ్యాక్స్ ‘రిటైర్డ్ హర్ట్’గా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఆ టైం లో బై రన్నర్ వస్తే సరిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ, ఐసీసీ ఈ వెసులుబాటుని గతంలోనే ఎత్తేస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటి ప్రకారం గాయాల పాలైన, హెల్త్ పరంగా ఇబ్బంది ఎదురైనా బై రన్నర్ ను పెట్టుకునే అవకాశం ఉండదు.
Read More: