Advertisement
అప్సర కేసు గురించి వినే వుంటారు. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అప్సర కేసు గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటారు. అప్సర పెళ్లి చేసుకోమని కోరినందుకు ఆమె ప్రియుడు పూజారి సాయికృష్ణ ఆమె ని హత్య చేసాడు. అయితే రోజు రోజూ కి ఏదో ఓ కొత్త విషయం బయట పడుతోంది. ఆమె ని చంపేసి మ్యాన్ హోల్ లో పడేసి పూడ్చి పెట్టి వచ్చేసాడు ఇలా జరిగినది అంతా బయట కి రావడం తో ఆఖరికి నిందితుడు సాయి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసారు.
Advertisement
ఇలా ఇదంతా కూడా ఓ సినిమా స్టోరీ లాగా జరిగింది. ఆ తరవాత అప్సర కేసు లో మరో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఒకటి బయట పడింది. అప్సరకు వివాహం ఇది వరకే ఓ వ్యక్తి తో జరిగినట్లుగా తెలిసింది. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇలా అప్సర కేసు లో కొత్త కొత్త విషయాలు బయటకి వస్తున్నాయి.
అప్సర తల్లి అరుణని కూడా ఇదే విషయం మీద వివరణ కోరారు. తన కూతురికి పెళ్లి అయిన విషయం తర్వాత ముందు ఆమె చావుకి కారణమైన సాయిని శిక్షించాలని ఆమె అంది. అయితే ఇది వరకు పెళ్లయిన ఫోటోలు ఎలా లీక్ అయ్యాయి అనే విషయం తనకి తెలియదు అని అయినా పాత విషయాలు ఇప్పుడు ఎందుకని ఏదో దాచే ప్రయత్నం చేశారు అప్సర తల్లి ఆ పెళ్లి గురించి మాట్లాడలేదు. ఇదిలా ఉంటే ఈ కేసులో కొత్త విషయం మరొకటి బయటకి వచ్చింది అప్సర పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు కార్తీక్ రాజా.
Advertisement
కార్తీక్ రాజా తల్లి పేరు ధనలక్ష్మి. అప్సర కి సంబంధించిన ఆడియో ద్వారా ఒక విషయం బయటపడింది. తమిళనాడుకు చెందిన కార్తీక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతన్ని అప్సర ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే తన కుమారుడుని అప్సర విధించేదని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆ ఆడియో లో ఉంది పెళ్లయిన కొద్ది రోజులకి అప్సర, అప్సర తల్లి అరుణ ఇద్దరు కూడా కొడుకుని వేధించారని ధనలక్ష్మి అన్నారు.
లగ్జరీ లైఫ్ కావాలని టూర్లకి తీసుకు వెళ్ళమని ఆమె ఇబ్బంది పెట్టేదని.. ఎప్పుడూ అప్సర తన కొడుకు గొడవపడే వారని కార్తీక్ మీద పోలీస్ కేసు కూడా పెట్టారని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అప్సర తల్లి అరుణ చెప్పింది. జైలు నుండి వచ్చిన తర్వాత మానసికంగా కృంగిపోయాడని ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పింది ఆ తర్వాత అప్సర తన తల్లి కనపడలేదని వాళ్ళిద్దరూ హైదరాబాదులో ఉన్న విషయం తనకి తెలియదని ఆమె చెప్పింది.
Also read:
పుష్ప సినిమాలో.. సుకుమార్ ఇంత చిన్న ఫన్నీ లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు..?
తమన్ భార్య శ్రీ వర్దిని గురించి.. చాలా మందికి తెలియని విషయాలు ఇవే..!