Advertisement
తెలుగు పాట చరిత్ర సృష్టించింది. అందరూ ఎదురు చూసిన కళ నెరవేరింది. యావత్ దేశం సంతోషంతో పులకరించి పోయింది. 130 కోట్ల మంది గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన “నాటు నాటు” పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డుని ప్రకటించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటుకి ఈ అవార్డు రావడం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. 8 దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. ది అవార్డు గోస్ టు ” నాటు నాటు” అని చెప్పగానే అక్కడ ఉన్న రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు.
Advertisement
Read also: ‘కాంతారా’ సినిమాకి ‘విరూపాక్ష’ సినిమాకి ఉన్న ఉన్న లింక్ ఏంటో తెలుసా?
ఈ ఆస్కార్ అవార్డును సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డు అందుకోవడమే కాదు.. నామినేట్ అవ్వడానికి కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఈ ఆస్కార్ అవార్డును 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీలు అకాడమీ అవార్డ్స్ పేరుతో ప్రారంభించారు. అయితే మొదట సినీ పరిశ్రమలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డు ఇచ్చేవారు. కాలక్రమంలో సినీ జగత్తులో ఇదే అత్యుత్తమ పురస్కారంగా మారిపోయింది. ప్రతి ఏడాది ప్రపంచ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డును అందుకోవడం అంత సులభం కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. చిత్రపరిశ్రమలో నోబెల్ లా భావించే ఈ ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా..? ఒకవేళ అమ్మితే ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Advertisement
Read also: కల్యాణ్ దేవ్ సంచలన పోస్ట్.. ఆ తప్పులు అంటూ !
ఆస్కార్ అవార్డు చూడడానికి గోల్డ్ కలర్ లో ఉంటుంది. కానీ పూర్తిగా అది బంగారం కాదు. కాపర్ తో తయారు చేసి.. పైన గోల్డ్ పూత పూస్తారు. ఈ అవార్డు 13.5 ఇంచుల హైట్, 4 కేజీల వెయిట్ ఉంటుంది. ఈ ఆస్కార్ అవార్డు తయారు చేసేందుకు 400 డాలర్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ అవార్డు అమ్మితే కేవలం ఒక్క డాలర్ మాత్రమే వస్తుంది. ఈ ఆస్కార్ అవార్డు విలువ ఒక్క డాలర్ ఉండడానికి ప్రధాన కారణం 1950లో అకాడమీ ప్రవేశపెట్టిన నిబంధననే. గతంలో అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ దక్కించుకున్నారు.
Read also: 12 ఇయర్స్, కపుల్ చాలెంజ్! అలా మొదలైంది మా ప్రేమ కథ!
అయితే గెలుచుకున్న అవార్డుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలం వేసి ఏకంగా రూ. 6.5 కోట్లకు అమ్ముకున్నారు. దాంతో ఆగ్రహించిన అకాడమీ.. ఇంకెవరు ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డును అమ్మకుండా 1950లో ఒక రూల్ తీసుకువచ్చింది. ఆస్కార్ గెలుచుకున్న విన్నర్ తన అవార్డు ఇతరులకు అమ్మడానికి వెళ్లేదని, తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే ఒక డాలర్ ఇస్తామని నిబంధన తెచ్చారు. అంటే 82 రూపాయలు అన్నమాట. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును ఎవరు అమ్ముకోవాలని అనుకోరు కదా!.
Read also: ACTRESS HEMA HUSBAND: నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?