Advertisement
మహాశివరాత్రి నాడు హిందువుల ప్రత్యేకించి పరవశివుడ్ని ఆరాధిస్తూ ఉంటారు. పరమశివుడ్ని మహాశివరాత్రి నాడు ఆరాధిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈసారి మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. శివరాత్రి నాడు కొన్ని ప్రత్యేక నియమాలని పాటిస్తూ ఉంటారు. శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. అయితే బిల్వపత్రాలని శివుడికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బిల్వపత్రం శివుడిని సంతోష పరుస్తుందట భక్తుల కోరికలు అన్నీ కూడా తీరుతాయి. శివుడిని చల్లగా ఉంచుతుంది. శివుని తల చల్లగా ఉంచుతుందని బిల్వపత్రాలని పెట్టాలని అంటూ ఉంటారు పండితులు.
Advertisement
శివుడికి బిల్వపత్రం సమర్పించడం వలన కోటి కన్యాదానానికి సమానమైన పుణ్యం కలుగుతుంది. బిల్వపత్రం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి శివుడికి బిల్వపత్రం సమర్పించడం వలన పేదరికం తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుంది. శివుడిని పూజించే సమయంలో శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పిస్తే మహిళలకి శాశ్వతమైన ఐశ్వర్యం కలుగుతుంది గంధంతో శివలింగానికి రామా లేదా ఓం నమశ్శివాయ సమర్పించడం వలన కోరికలు నెరవేరుతాయి. శివుడికి బిల్వపత్రం సమర్పించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది కష్టాల నుండి కూడా విముక్తి కలుగుతుంది.
Advertisement
మూడు ముఖాల బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడం వలన అనుకున్న పనులు జరుగుతాయి కోరికలు తీరుతాయి. వీటిని సమర్పించేటప్పుడు మచ్చలు వంటివి లేకుండా చూసుకోండి. నల్ల మచ్చ వున్న బిల్వపత్రాన్ని శివుడికి పెట్టకూడదు కుళ్ళిపోయిన వాటిని కూడా పెట్టకూడదు. మంచి వాటిని మాత్రమే పెట్టండి శివలింగం పై బిల్వపత్రాన్ని సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి తర్వాత మాత్రమే పెట్టాలి బిల్వపత్రాన్ని శివుడికి పెట్టేటప్పుడు. 11 లేదా 21 సంఖ్యల్లో సమర్పించేటట్టు చూడండి లేదంటే ఒకటైన పెట్టొచ్చు. శివరాత్రి నాడు పరమేశ్వరుడిని ఆరాధించేటప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అలానే చాలామంది సోమవారం కూడా బిల్వపత్రాలని శివుడికి పెడుతుంటారు అటువంటి అప్పుడు కూడా ఈ తప్పులు చేయకండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!