Advertisement
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది. సాధారణంగా తాజా ఫ్రూట్స్, వెజిటబుల్స్, మందులు లాంటివి ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు అనుకూలం. ఫ్రిడ్జ్ సద్ది పెట్టే అని నానుడి కూడా ఉంది. దానికి కారణం మిగిలిన ఆహార పదార్థాలు అన్నింటిని అందులో పెట్టడమే. ఈ మధ్యకాలంలో దాని వాడకం గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రిషన్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టేముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి అవగాహనకు రండి. ఎలాంటి ఆహారాలు, ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం.
Advertisement
టమోటా
టమోటాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఆశ్చర్యంగా ఉందా? నిజమే వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ మిస్ అవుతుంది. అలాగే త్వరగా పండుతాయి. కాబట్టి బయట పేపర్ బ్యాగులో పెట్టుకోవడం మంచిది.
ఉల్లిపాయలు
పేపర్ బ్యాగులో పెట్టడం వల్ల ఉల్లిపాయలు తాజాగా ఉంటాయి. అయితే చాలా మంది ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి పెడుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. బంగాళదుంపలు విడుదల చేసే మాయిశ్చరైసర్ వల్ల ఉల్లిపాయలు దెబ్బతింటాయి.
Advertisement
బంగాళదుంపలు
బంగాళదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ పై దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి పేపర్ బ్యాగ్స్ లో పెడితే తాజాగా ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టడం కూడా మంచిది కాదని గుర్తుంచుకోండి. త్వరగా కుళ్ళిపోతాయి.
తేనె
తేనె ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్. అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అవుతుంది. కాబట్టి రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవాలి. అయితే సూర్యరష్మి తగలకుండా పెట్టడం మంచిది.
పీనట్ బట్టర్
పీనట్ బట్టర్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కూల్ గా, చీకటిగా ఉండే ప్రాంతంలో పెట్టుకుంటే మంచిది.
కాఫీ
కాఫీ ని ఎయిర్ టైట్ కంటేఇనర్ లో పెట్టడం వల్ల చాలా మంచి వాసన, తాజాగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది.
కొన్ని రకాల పండ్లు
అవకాడో, యాపిల్స్, అరటి పండ్లు, నారింజ, బెర్రీస్, పీచు, ఆఫ్రికాట్ వంటి ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. అయితే మీరు చల్లగా తినాలి అనుకుంటే తినడానికి అరగంట ముందు పెట్టుకోవాలి. అయితే ఆరెంజ్, నిమ్మకాయలను రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవడం మంచిది. కట్ చేసిన ఆవకాడో ఫ్రూట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.
ఇవి కూడా చదవండి : Ranga Ranga Vaibhavanga Review: `రంగరంగ వైభవంగా` రివ్యూ