• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » పవిత్రతో వ్యవహారంపై నరేష్ ను మందలించిన సూపర్ స్టార్ కృష్ణ?

పవిత్రతో వ్యవహారంపై నరేష్ ను మందలించిన సూపర్ స్టార్ కృష్ణ?

Published on July 11, 2022 by Bunty Saikiran

Advertisement

గత కొద్దిరోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో వీరు సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవే నిజమయ్యాయి. వీరిద్దరూ నరేష్ భార్య రమ్య రఘుపతికి మైసూర్ లోని ఓ హోటల్లో పట్టుబడ్డారు. తర్వాత వీరు నిజం చెప్పక తప్పలేదు.

తాము సహజీవనం చేస్తున్నామని విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. దీంతో నరేష్, పవిత్ర లోకేష్ లపై ఉన్న గౌరవం కాస్త పోయింది. గతంలో వీరికి ఎంతో పేరు ఉండేది. ఆ ఒక్క సంఘటనతో పేరు మొత్తం పోగొట్టుకున్నారు. పవిత్రను అయితే రెండు సినిమాల నుంచి తొలగించారు.

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

Advertisement

ఇక ఈ వ్యవహారంలో ముఖ్యపాత్ర అయిన రమ్య రఘుపతి తన భర్త నరేష్ పై న్యాయపోరాటం చేస్తానని తెలియజేసింది. తనను గన్ తో బెదిరించి తన నుంచి విడాకులు తీసుకోవాలని చూస్తున్నాడని, కానీ ఆయనపై న్యాయం కోసం పోరాడుతానని చెప్పింది. అయితే నరేష్ వ్యవహారంపై కృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఆయన అసలు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ నరేష్ వల్ల కృష్ణ పేరు కూడా బయటకు వచ్చింది. ఆయనకు తెలిసే తాము ఇలా చేస్తున్నామని పవిత్ర లోకేష్ కూడా చెప్పింది. దీంతో కృష్ణ తన పేరు అలా బయటకు రావడ్డాన్ని ఆయన సహించలేకపోతున్నారట. నరేష్ ను ఈ విషయంపై ఆయన మందలించారట. అనవసరంగా ఫ్యామిలీ పేరు చెడగొడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ కార్యక్రమంలో భాగంగా కృష్ణ ఓ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధితో అనేక విషయాలను చర్చించారట. వాటిలో నరేష్ వ్యవహారం కూడా ఒకటి ఉందని తెలిసింది. ఈ క్రమంలోనే నరేష్ ఇలా చేస్తాడని అనుకోలేదని ఆయన అన్నారట. పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇవ్వడం వరకు ఓకే. కానీ ఇలా సహజీవనం, ప్రేమ వ్యవహారం అంటే కుటుంబం పరువు మొత్తం పోతుందని ముందుగానే కృష్ణ భయపడ్డారట. పెళ్లి చేసుకొని కలిసి ఉండాలని చెప్పారట కూడా. కానీ నరేష్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారట. దీంతో ఇప్పుడు జరగరానిది జరిగిపోయింది. ఫ్యామిలీ బండారం మొత్తం బయటపడింది. ఇదే విషయంపై కృష్ణ అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది, అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : టాలీవుడ్‌ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd