• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Horoscope » Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 30.08.2022

Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 30.08.2022

Published on August 30, 2022 by Bunty Saikiran

Advertisement

Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 30.08.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్‌ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ మంగళ వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.

Advertisement

మేషం :- ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. సభ, సన్మానాలలో చురుకుగా పాల్గొంటారు.

వృషభం :- మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వ్యాపారాల్లో అమలు చేసిన పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు.

మిథునం :- మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు, ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల, తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహోపకరణాలు అమర్చుకుంటారు.

కర్కాటకం :- కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూల మవుతాయి. సమయస్ఫూర్తితో ఒక సమస్యను అధిగమిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్తోమతుకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందు లెదర్కుంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి.

సింహం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకోవటం మంచిది.

కన్య :- ఫైనాన్సు, వ్యాపారులు మొండి బాకీల మీద దృష్టి ఉంచండి. మీతో సఖ్యత నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.

Advertisement

తుల :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్ని నచ్చని సంఘటనలెదురైనా భరించక తప్పదు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరా లెదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించినవే కావటంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సిద్ధం చేసుకుంటారు.

వృశ్చికం :- వాణిజ్య ఒప్పందాలు, బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో ఏకాగ్రత అవసరం. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్లీడర్లకుతమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు :- స్త్రీల పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు సమస్యలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం :- కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టము సంభవించును. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. ఆరోగ్యములో ఆకస్మిక ఆందోళనతప్పదు.

కుంభం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు.

మీనం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులు, రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.

ఇవి కూడా చదవండి :  చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?

Related posts:

Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 17.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 13.09.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 12.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 24.10.2022

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd