Advertisement
అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ వారితో కలిసిపోతుంది. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలిసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. కానీ, చట్ట ప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు.
Advertisement
రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది వ్యక్తుల ఇష్టం. అయితే పేరు మార్చుకునే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. వివాహిత తనకు పెళ్లికాకముందు ఉన్న ఇంటి పేరుని (మేయిడెన్ నేమ్) కొనసాగించుకోవచ్చు. పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండోది. మన దేశంలో అధిక శాతం మంది అనుసరించే విధానం ఇది.
పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరు నువ్వు మార్చుకోకుండానే, భర్త పేరును కూడా చేర్చుకోవడం మరో విధానం. ఉదాహరణకు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడిన తర్వాత తన పూర్తి పేరు చివర్లో బచ్చన్ ను చేర్చుకుంది. సమస్యలు రాకుండా ఉండాలంటే, పెళ్లి కాక ముందున్న పేరుతోనే పెళ్లయిన స్త్రీ కొనసాగితే, భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబపరమైన వివాదాలు తలెత్తితే ఎటువంటి సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నలు ఉదయిస్తాయి.
Advertisement
ఊహించని ఆస్తి, ఇతరత్రా వివాదాలు తలెత్తిన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లి అయిన మహిళ తన ఇంటిపేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం మంచిదని కొందరు సూచిస్తుంటారు. ఒకవేళ పేరు మార్చుకున్నట్టే అయితే, ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేయించుకోవాలి. రెండు, మూడు ఆప్షన్లలో ఏదైనా ఆ మేరకు కీలక డాక్యుమెంట్లలో పేర్లను కూడా మార్చుకోవాలి. దాంతో ఆర్థిక, ఆస్తి లావాదేవీల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు నిపుణులు. భర్త ఇంటి పేరు నువ్వు స్వీకరిస్తే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ వంటి వాటిలో ఆమెకు మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలోని పేరు మార్చుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు కీలకం బ్యాంకు ఖాతా. ఇక మ్యూచువల్ ఫండ్స్, డిమ్యాట్ ఖాతాల్లోనూ మార్పులు చేసుకోవాలి. వీటిల్లో పేర్ల మార్పు కోసం ఆ పిడవైట్ జిరాక్స్ కాపీ లేదా వివాహ నమోదు దృవీకరణ పత్రం కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా హైతరాత్ర ఎక్కడెక్కడ పేరు మార్చుకోవాలన్నది మీకున్న వ్యవహారాలను బట్టి తెలిసిపోతుంది. ఉద్యోగం చేస్తుంటే, సంబంధిత కార్యాలయంలోని రికార్డుల్లోనూ మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని మర్చిపోవద్దు.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?