Advertisement
రాముడు పాదకుల్ని మాత్రమే రాజ్య పాలన కోసం ఎందుకు ఇచ్చారు..? అరణ్యవాసం చేస్తున్న రాముడు భరతునికి పాదకులు మాత్రమే రాజ్య పాలన కోసం ఎందుకు ఇచ్చారు..? ఈ విషయం గురించి చాలా మందికి సందేహం ఉంది. ఒక రోజు శ్రీమహాలక్ష్మి శిరస్సు పైన కిరీటం స్వామి వారి పాదరక్షలని చూసి హేళన చేసి కించపరిచింది. నేను శ్రీమహావిష్ణువు శిరస్సు మీద దర్జాగా ఉన్నాను నువ్వేమో స్వామి వారి పాదాల దగ్గర ఉన్నావు మనుషులు కూడా నిన్ను తొడుక్కునే ఊరంతా తిరుగుతూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతే అని అంది.
Advertisement
కానీ నా విషయానికి వస్తే నన్ను స్వామివారు శిరస్సు మీద ధరించడమే కాకుండా దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అన్ని అర్హతలు ఉన్నచోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయట ఉంచుతారు. బయటకి నన్ను విసరరు అని పాదరక్షలని చూసి నవ్వింది కిరీటం. పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకి దిగలేదు. శ్రీమహావిష్ణువు ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు గోడు వినిపించాయి. స్వామివారికి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఈ పాతరక్షకల బాధ విని.. స్వామి వారు పాదరక్షకులారా నా పాదాలకి రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధపడుతున్నారు..? మిమ్మల్ని నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు కదా..? కిరీటం అన్నమాట బాధపడతారా అని అడిగారు.
Advertisement
వెంటనే పాదరక్షలు తమ గోడునంతా మళ్లీ విడమర్చి చెప్పాయి దాంతో స్వామి వారు ఎందుకు బాధపడుతున్నారు. దాన్ని మర్చిపోండి. కిరీటం మాటల్ని పట్టించుకోవద్దు నేను రామ అవతారంలో మిమ్మల్ని 14 ఏళ్లు పాటు సింహాసనంలో ఉంచి, రాజ్య పాలన చేయిస్తానని అన్నారు ఆ మేరకు శ్రీమహావిష్ణువు రాముడిగా అవతారం ఎత్తినప్పుడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలు ని తీసుకుని వాటిని సింహాసనం స్థానంలో ఉంచి పాలన చేశారు అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషపడ్డాయి. భరతుడు ప్రతిరోజు సింహాసనం ముందు కూర్చుని పాదుకులని నమస్కారం చేసినప్పుడల్లా అతని శిరస్సు మీద ఉన్న కిరీటం సిగ్గుతో తలవంచి తను తప్పుకి పాదుకలని కించపరిచి మాట్లాడినందుకు బాధపడింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!